ఔను! రాజకీయ విశ్లేషకులు ఇదేమాట చెబుతున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి.. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలని.. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు తపిస్తున్నారు. పార్టీ నాయకులను తన సొంత మనుషులు చూస్తూ..నియోజకవర్గాల్లో తిరుగుతూ.. ఈ వయసులోనూ.. 18 గంటల పాటు ఆయన పనిచేస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉండికూడా.. ఆయన నిరంతరం.. పనిచేస్తున్నారు. ఎక్కడా విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని.. పార్టీని డెవలప్ చేసేందుకు.. తమ్ముళ్లను గెలిపించుకునేందుకు.. నియోజకవర్గాలు.. జిల్లాలు.. ఇలా.. అన్ని రూపాల్లోనూఆయన పార్టీని అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నారు. అంతేకాదు.. “నన్ను చూసి గెలిపించండి!” అని ఆయనగత 2019 ఎన్నికల్లోనూ.. ఇప్పుడు కూడా ప్రజలకు విన్నవిస్తున్నారు.
అయితే.. పార్టీలో నాయకులు మాత్రం ఫిఫ్టీ-ఫిఫ్టీ అన్నట్టుగా ఉన్నారు. కొందరు యాక్టివ్‌గా ఉంటే.. మరికొందరు ‘అంతా బాబే చూసుకుంటారులే.. మనకెందుకు’ అనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. మరి ఇది ఎంత వరకు సమంజసమో తమ్ముళ్లు తెలుసుకోవాలి. ఇక, ఇదే సమయంలో అధికార పార్టీ వైసీపీ విషయానికి వస్తే.. ఎమ్మెల్యేలకు రూపాయి ఇవ్వడం లేదు. పోనీ.. నియోజకవర్గాల్లో మూడేళ్లయినా.. అభివృద్ధి లేదు. గుంతలు పూడ్చమన్నా దిక్కులేదు. దీంతో అసలు ఎమ్మెల్యేలకు ప్రజల మధ్యకు వెళ్లలేని పరిస్థితి.
దీనికి కారణం.. స్వయానా సీఎం జగన్. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. కానీ, ఆయన మాత్రం.. అంతా ఎమ్మెల్యేలపైనే భారం వేసేశారు.”మిమ్మల్ని మీరే గెలిపించుకోండి.. నన్ను మాత్రం సీఎం చేయండి” అనే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి ఆయన చెప్పింది ఇదే. మరి దీనిని బట్టి.. నాయకుల విషయంలోనూ.. పార్టీ విషయంలోనూ.. ఎవరు కేర్ తీసుకుంటున్నారు? అనేది తమ్ముళ్లు ఆలోచించుకోవాలి. అన్నీ నేను చూసుకుంటాను.. అనే ధైర్యం ఇస్తున్న చంద్రబాబు ఉద్దేశాన్ని ఇప్పటికైనా.. తమ్ముళ్లు అర్ధం చేసుకుంటారా? లేదా..? అనేది చూడాలని అంటున్నారు పరిశీలకులు.