మోడీ స్నేహం మంచిది కాదా..ఇంట‌ర్నేష‌న‌ల్ డిబేట్‌

అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై ఒక ఆస‌క్తిక‌ర చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఆయన స్నేహితులు వ‌రుస‌గా ప‌ద‌వులు కోల్పోవ‌డం.. త‌ర్వాత జ‌రుగుతున్న ప‌రిణామాలు వంటివి.. సెంటిమెంటుకు ఆజ్యం పోస్తున్నారు. దీంతో మోడీ స్నేహితులు.. ప‌ద‌వులు పోగొట్టుకుంటున్నార‌నే.. సెంటిమెంటు.. అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ప్ర‌ధాని మోడీకి స్నేహితులుగా ఉన్న అభివృద్ధి చెందిన దేశాధి నేత‌లు.. ప‌ద‌వులు పోగోట్టుకున్నారు.

ఇక‌, పొరుగున ఉన్న పాకిస్తాన్ ప్ర‌ధాని(క్రికెట‌ర్‌) ఇమ్రాన్ కూడా ప‌ద‌వి పోగొట్టుకున్నారు. ఇమ్రాన్ పుట్టిన రోజు నాడు.. ప్ర‌ధాని మోడీ.. గుజ‌రాతీ ర‌స‌గుల్లా.. ఇక్క‌డ మాత్ర‌మే ప్ర‌త్యేక మైన వంట‌కాల‌ను.. పంపించారు. అనూహ్యంగా ఇది జ‌రిగిన త‌ర్వాత‌.. ఇమ్రాన్ ప‌ద‌విని పొగోట్టుకున్నారు. వాస్త‌వానికి ప‌ద‌వులు పోగొట్టుకోవ‌డం.. అనేదివారు వారు అనుస‌రించే వ్యూహాలు వేసే ఎత్తుగ‌డ‌ల మేర‌కే ఉంటుంది. కానీ, ఎందుకో.. మోడీ చుట్టూ.. ఇప్పుడు ప్ర‌త్యేక చ‌ర్చ అయితే.. జ‌రుగుతోంది.

ఇక‌, అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు.. మోడీకి మ‌ధ్య ఉన్న స్నేహం అంతా ఇంతా కాదు. వీరిద్ద‌రూ.. ప‌ర‌స్ప‌రం అనేక విష‌యాల్లో స‌హ‌క‌రించుకున్నారు. మోడీ ఏకంగా.. ట్రంప్‌కు.. ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా చేశారు. ఏడు రోజుల పాటు అమెరికాలోనే ఉండి… మ‌రీ మ‌న వారి ఓట్ల‌ను ట్రంప్‌కు వేయించే ప్ర‌చారం చేశార‌నే వాద‌న అప్ప‌ట్లో మోడీగురించి వినిపించింది. ఇక‌, ఎన్నిక‌ల్లో ట్రంప్ ఘోరంగా ఓడిపోయారు. దీనిపైనా అప్ప‌ట్లో మోడీపై వ్యంగ్యాస్త్రాలు వ‌చ్చాయి. తాజాగా మ‌రోసారి ఈ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది.

ఇక‌, మోడీ మ‌రో ఫ్రెండ్‌.. బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌.. వీరిద్ద‌రి మ‌ధ్య కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. కొవిడ్ వ్యాక్సిన్ నుంచి వీసాల వ‌ర‌కు కూడా.. మోడీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌నే పేరు జాన్స‌న్ తెచ్చుకున్నారు. అదేవిధంగా మోడీ కూడా జాన్స‌న్ అంటే.. తెగ ఇష్ట‌ప‌డ‌తారు. ఇటీవ‌ల జాన్స‌న్‌ను ఇండియాకు ర‌ప్పించి మ‌రీ.. ప్ర‌త్యేకంగా అభినందించారు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా జాన్స‌న్ త‌న ప్ర‌ధాని ప‌ద‌విని కోల్పోయారు.

అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. వ్య‌తిరేక‌త‌తో బోరిస్ ప‌ద‌వి పోగోట్టుకున్నారు. ఈ ప‌రిణామాలతోనే.. ప్ర‌ధాని మోడీ స్నేహితులు.. ప‌దవులు పోగొట్టుకుంటున్నారంటే.. ఆయ‌న స్నేహం.. సెంటిమెంటు..లో ఏదో తేడా ఉంద‌నే టాక్ వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇదంతా.. కేవ‌లం ఎవ‌రి త‌ల‌రాత‌ను బ‌ట్టి వారికి ఉంటుంద‌ని.. ప‌ద‌వులు.. అధికారాలు శాశ్వ‌తం కాద‌ని అంత‌ర్జాతీయ రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కొంత టైం పాస్ కోసం.. కొంద‌రు చేస్తున్న ప్ర‌చారంగా చెబుతున్నారు.