Gulte TeluguGulte Telugu Telugu Political and Movie News Updates

  • Home
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా రివ్యూ
  • ట్రెండ్స్
  • English
Home/Political News/ఉద్యోగుల సొమ్ము జ‌గ‌న్ పాలు.. 800 కోట్లు హుష్‌!!

ఉద్యోగుల సొమ్ము జ‌గ‌న్ పాలు.. 800 కోట్లు హుష్‌!!

Article by Satya Published on: 4:00 pm, 29 June 2022

ఎక్క‌డైనా.. ఏదైనా ప్ర‌భుత్వం ఉద్యోగుల‌తో ప‌నిచేయించుకుని.. వారికి జీతాలు.. భ‌త్యాల రూపంలో సొమ్ములు ఇస్తుంది. కానీ, ఏపీలో మాత్రం రివ‌ర్స్ జ‌రుగుతోంద‌ని.. ఇక్క‌డి ఉద్యోగులు గ‌గ్గోలు పెడుతున్నా రు. ప్ర‌భుత్వం త‌మ‌ను మరోమారు నమ్మించి, మోసం చేసిందనే వాద‌న ఉద్యోగ సంఘాల నుంచి వినిపి స్తోంది. డీఏ బకాయిలను జీపీఎఫ్‌ ఖాతాలకు జమ చేసినట్లే చేసి, వెనక్కి తీసుకుందని చెబుతున్నారు. వ్యక్తిగత జీపీఎఫ్‌ ఖాతాల నుంచి తమ అనుమతి లేకుండా తీసుకోవడంపై ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.

ప్రభుత్వం వెనక్కి తీసుకున్న డీఏ బకాయిలు సుమారు రూ.800 కోట్ల వరకు ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రంలో 90వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి ఈ సొమ్ము మాయమైందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటానికి వెనుకాడేది కూడా లేదని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఖాతాలో ఎవరైనా జమ చేయొచ్చు. విత్‌డ్రా చేసే అధికారం మాత్రం ఉద్యోగికే ఉంటుంది. ఉద్యోగుల అనుమతి లేకుండా ఇప్పుడు ప్రభుత్వం నిధులను తీసేసుకుంది. దీనిపైనా కొందరు ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు.

విత్‌డ్రా చేయడానికి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వనందున ఎలా ఫిర్యాదు చేయాలి? సీఎఫ్‌ఎంఎస్‌పై ఫిర్యాదు చేయాలా? అని సమాలోచనలు చేస్తున్నారు. 2021 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి వరకు జీపీఎఫ్‌ ఖాతాలకు సంబంధించిన వివరాల స్లిప్పులను ఏజీ కార్యాలయం ఆన్‌లైన్‌లో పెట్టింది. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న ఉద్యోగులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. డీఏ బకాయిలను విడతల వారీగా జమచేసినట్లు స్లిప్పుల్లో ఉండగా.. గత మార్చిలో మొత్తం ఒకేసారి వెనక్కి తీసేసుకున్నట్లు ఉంది.

ఉద్యోగుల సర్వీసును అనుసరించి ఒక్కొక్కరి ఖాతాలో సుమారు రూ.60 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు జమ అయినట్లే అయ్యి, వెనక్కి వెళ్లిపోయాయి. గత మార్చిలోనే కొంతమంది ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి నగదు వెనక్కి వెళ్లిపోయినట్లు సెల్‌ఫోన్లకు సమాచారం వచ్చింది. అప్పట్లో దీనిపై ఆందోళనతో ఆర్థికశాఖకు ఫిర్యాదులు చేశారు. కానీ, జీపీఎఫ్‌ ఖాతాకు సంబంధించి ఆర్థిక సంవత్సరం పూర్తి వివరాల స్లిప్పులు రాకపోవడంతో కొందరు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు స్లిప్పులు చూసుకున్నవారు ఆందోళన చెందుతున్నారు.

గ‌తంలో ఏం చెప్పిందంటే..

ప్రభుత్వం వెనక్కి తీసుకున్న డీఏ బకాయిలు సుమారు రూ.800 కోట్ల వరకు ఉంటాయి. రాష్ట్రంలో 90వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి ఈ సొమ్ము మాయమైంది. 2018 జులై నుంచి 2020 డిసెంబరు వరకు, 2019 జనవరి నుంచి 2021 జూన్‌ వరకూ ఉన్న డీఏ బకాయిలను వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొంది. 2021 ఏప్రిల్‌ నుంచి 2022 జనవరి వరకు అయిదు విడతలుగా జీపీఎఫ్‌ ఖాతాలకు జమచేసింది. మార్చిలో ఒకేసారి ఆ మొత్తాన్ని వెనక్కి లాగేసింది.

ఇది ఉద్యోగుల వాట్సప్‌ గ్రూపుల్లో హల్‌చల్‌ చేసింది. ప్రభుత్వ చర్యలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. డీఏ బకాయిల్లో సీపీఎస్‌ ఉద్యోగులకు 90% నగదు, 10% సీపీఎస్‌ ఖాతాలకు జమచేయాల్సి ఉండగా.. దీన్ని పట్టించుకోవడం లేదు. కొంతకాలంగా సీపీఎస్‌ ఉద్యోగులు ఎన్ని వినతులు ఇచ్చినా ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. పదవీవిరమణ చేసిన వారికి నగదు రూపంలో ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు. అలా ఇవ్వకపోగా.. ఇప్పుడు జీపీఎఫ్‌ ఖాతాల్లో జమచేసిన మొత్తాన్నీ ప్రభుత్వం తీసేసుకోవ‌డంపై తీవ్ర స్థాయిలో ఉద్యోగులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Tags AP Govt Employees Employee GPF account YS Jagan

Latest Stories

  • పవన్… ‘ఒక్కరోజు విలేజ్’ పిలుపు ఫలించేనా?

    7 hours ago
  • ‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

    13 hours ago
  • అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

    13 hours ago
  • జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

    16 hours ago
  • చంద్రబాబుపై బండ్ల గణేష్ అభిమానం వెలకట్టలేనిది

    17 hours ago

Most Viewed

  • ఏపీలో 1000.. తెలంగాణలో 175
    ఏపీలో 1000.. తెలంగాణలో 175
  • రాజు గారెక్కడ రాజాసాబ్?
    రాజు గారెక్కడ రాజాసాబ్?
  • పెద్ద ప్రభాస్ రిటర్న్స్... టికెట్ ధరలు నార్మల్
    పెద్ద ప్రభాస్ రిటర్న్స్... టికెట్ ధరలు నార్మల్
  • 'భర్త' మహా 'రాజు'లకు భలే వరం దొరికింది
    'భర్త' మహా 'రాజు'లకు భలే వరం దొరికింది
  • శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా
    శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా
Gulte
Back To Top

Follow Us

     
  • About Us
  • Editorial Guidelines
  • Privacy Policy
  • Advertise With Us
  • Contact Us
Copyright © 2025 Gulte, All Rights Reserved.