ఏపీ సీఎం జగన్ వ్యాపార భాగస్వామి.. దక్షిణ భారతేదశంలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఒకరైన మంత్రి డెవలపర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ మంత్రి ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ ఆరోపణల కింద ఆయనను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. అనంతరం ఆయనను ఈడీ కోర్టులో ఆయనను ప్రేవేశపెట్టగా…పది రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.
మంత్రి డెవలపర్స్ నుంచి ఫ్లాట్లు కొనుగోలు చేసిన చాలా మంది కంపెనీపై ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజుల నుంచి మంత్రి డెవలపర్స్‌పై నిఘా వేసిన ఈడీ అధికారలు.. ఫ్లాట్ల కోసం తీసుకున్న సొమ్మును తమ సొంత కంపెనీలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. విచారణ కోసం ఆయనకు సమన్లు పంపామని, విచారణ తరవాత అతన్ని మనీలాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 కింద ఆయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.
అయితే.. ఏపి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి సుశీల్ మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. జగన్‌కు సుశీల్ మంత్రి వ్యాపార భాగస్వామి కూడా అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈడీ సోదాల్లో గతంలోనూ మంత్రి పేరు వినిపించిందని పేర్కొన్నాయి. పీఎంఎల్ ఏ 2002 కింద కొనసాగుతున్న విచారణకు సంబంధించి బెంగళూరు ఆధారిత రియల్ ఎస్టేట్ సంస్థ మంత్రి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సుశీల్ పి మంత్రిని ED అరెస్టు చేయడం గమనార్హం.