సినిమాలు చూసి కన్నీళ్లు పెట్టుకునే వారు ఇప్పుడు చాలా చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే.. తమ జీవితాల్లోనూ సినిమాలను మించిన కష్టాలు వస్తున్నాయి. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరి కష్టాలు సినిమాలను తలపిస్తున్నాయి. దీంతో ఎంతో బాధాకరమైన సన్నివేశాలు.. సెంటిమెంటుతో కూడిన సన్నివేశాలు ఉంటే తప్ప.. పెద్దగా ఎవరికి కళ్లు చెమర్చడం లేదు. కానీ, కర్ణాటక సీఎం మాత్రం ఓ సినిమా చూసి భోరున కన్నీరు కార్చారు. ఇదేదో ఒక్క క్షణమో.. రెండు క్షణాలో కాదు.. సినిమా చూస్తున్నంత సేపు.. తర్వాత కూడా ఆయన కన్నీరు కారుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఘటన ఆసక్తిగా మారి వైరల్ అవుతోంది.
విషయం ఏంటంటే..
పెంపుడు జంతువులకు, మనుషులకు ఉన్న అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేం. వాటిని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిలా చూసుకుంటారు కొందరు. వాటికి ఏమైనా జరిగితే తట్టుకోలేరు కూడా. కొన్నిసార్లయితే కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాంటి ఘటనే కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైకు ఎదురైంది. ఇటీవల ఆయన 777 చార్లీ
అనే సినిమా చూశారు. పెంపుడు కుక్కతో ఒక వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు. అయితే సినిమా చూసిన సీఎం బొమ్మైకి చనిపోయిన తన పెంపుడు కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా చూస్తూ ఉన్నంత సేపు భావోద్వేగానికి గురయ్యారు. సినిమా హాలులోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.
బొమ్మై కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోలు, వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమా చూశాక సీఎం బొమ్మై మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. “కుక్కల గురించి అనేక సినిమాలు వచ్చాయి. అయితే జంతువులతో ఉండే అనుబంధం, భావోద్వేగాన్ని ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించా”రని చెప్పుకొచ్చారు. కుక్కలది షరతులు లేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అని అన్నారు.
బొమ్మై వ్యక్తిగతంగా జంతు ప్రేమికులు. కుక్కలంటే ఆయనకు మహా ప్రేమ. గతేడాది ఆయన పెంపుడు కుక్క చనిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజా సినిమా చూసినప్పుడు మళ్లీ తన కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతటి అధికార హోదాలో ఉన్నా సెంటిమెంటుకు పడిపోని వారు ఉండరని సీఎం నిరూపించారని అంటున్నారు నెటిజన్లు.
This post was last modified on June 15, 2022 10:59 am
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…