ట్విట్టరు వార్ – అదుపు తప్పిన రాజు, రెడ్డి యవ్వారం

సామాజిక మాధ్య‌మాలు అంటే.. స‌మాచారం ఇచ్చి పుచ్చుకునే సాధ‌నాలుగానే చూడాలి. కానీ, ఇటీవ‌ల కాలంలో సామాజిక మాధ్య‌మాలు… రాజ‌కీయ వివాదాల‌కు, సంఘ‌ర్ష‌ణ‌ల‌కు వేదిక‌గా మారుతున్నాయి. దీని వ‌ల్ల శాంతి యుత వాతావ‌ర‌ణం కూడా పోయి.. ఇబ్బందులు వ‌స్తున్నాయి. స‌రే.. ఈ విష‌యం ఎలా ఉన్నా.. వైసీపీలో ట్విట్ట‌ర్ వేదిక‌గా.. జ‌రుగుతున్న మాట‌ల యుద్ధం మ‌రింత వేడెక్కింది. సొంత పార్టీ నాయ‌కులే ఒక‌రిపై ఒక‌రు స‌భ్యత మ‌రిచిపోయి మ‌రీ.. వ్యాఖ్య‌లు సంధించుకుంటున్నారు.

వారే.. ఒక‌రు న‌ర‌సాపురం రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, మ‌రొక‌రు వైసీపీ ముఖ్య నాయ‌కుడు విజ‌య సాయిరెడ్డి. పార్టీపై నిత్యం విమ‌ర్శ‌లు గుప్పించే ఎంపీ ర‌ఘురామ‌పై వైసీపీలో ఎంతో మంది నాయ‌కులు… గుర్రుగా ఉన్న విష‌యం తెలిసిందే. వీరిలో సాయిరెడ్డి ముందు వ‌రుస‌లో ఉన్నారు. ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త వేటు వేయించాల‌నే ప్ర‌య‌త్నం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు .. ట్విట్ట‌ర్ వేదిక‌గా.. ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య కూడా వార్ న‌డుస్తూనే ఉంది. అయితే.. ఇప్పుడు మ‌రింత‌గా హ‌ద్దులు మీరిపోయింది.

మొద‌ట సాయిరెడ్డి.. ప‌రుషంగానే వ్యాఖ్య‌లు చేశారు..

“ఒరేయ్ డూప్లికేట్ గాజు…నీ మీసాలైనా ఒరిజినలేనా లేక పీకి అంటించుకున్నావా? వాటిని మెలి తిప్పడం ఎందుకురా?”.. అని సాయిరెడ్డి వ్యాఖ్యానించ‌గా…. “ఎవడు ఒరిజినల్ రాజో ఎవడు డూప్లికేట్ రెడ్డో ప్రజలకి ‘ఎరుక’లే రా! మనం కలిసినప్పుడు నా వెంట్రులన్నీ చూపిస్తా..నువ్వే పీకి చూస్కో!” అని ర‌ఘురామ రెచ్చిపోయారు.

“అడగకుండానే నియోజకవర్గం వదలి అజ్ఞాతవాసం, అరణ్యవాసం చేసే ఏకైక రాజు….విగ్గురాజు, పెగ్గురాజు!” అని సాయిరెడ్డి ప‌రుషంగా వ్యాఖ్యానించ‌గా.. దీనికి అంతే వేగంగా ర‌ఘురామ రిప్ల‌య్ ఇచ్చారు.. “అజ్ఞాతవాసం తరువాత పాండవులకి, అరణ్యవాసం తరువాత శ్రీ రాముడికి జరిగింది పట్టాభిషేకం. చచ్చింది కౌరవులు, దానవులు. తెలుసుకో రా కండోమ్ రెడ్డి!!” అని దూకుడు ప్ర‌ద‌ర్శించారు.

“ఢిల్లీలో కూర్చొని జోస్యాలు చెప్పే నర్సాపురం నక్కకి సిగ్గుంటే రాజీనామా చేసి గెలవాలి. నాలుగు పచ్చ కుల ఛానెల్స్ మైకులు ముందు పెట్టుకుని మొరగడం కాదు. నియోజకవర్గంలో తిరిగితే విగ్గు రాజాకు దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది” అని సాయిరెడ్డి నోరు పారేసుకున్నారు.

దీనికి కౌంట‌ర్‌గా “హలో రసిక వానరా! అవును నాకు ఉన్నది విగ్గు..ఎన్ని తన్నులు తిన్నా నీకు లేనిది సిగ్గు. కొత్తగా రాజీనామా అంటున్నావు? నువ్వు, నీ గ్యాంగ్ లీడర్ అనర్హత/సస్పెన్షన్ పై చేతులు ఎత్తేసారా? నేను ఏపీ కి వస్తే ముఖ్యమంత్రి కి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వుద్ది అనేగా నా పై కేసులు పెట్టిస్తున్నారు.”అని వ్యాఖ్యానించారు.

క‌ట్ చేస్తే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఇద్ద‌రు సీనియ‌ర్ నాయ‌కులు, దేశానికి మార్గ సూచిగా వ్య‌వ‌హ‌రించాల్సిన వారు.. ఇలా నోరు పారేసుకోవ‌డం.. బ‌రితెగించిన వ్యాఖ్యాలు చేసుకోవ‌డం.. వంటివి స‌భ్య స‌మాజానికి వీరు ఎలాంటి సందేశాలు ఇస్తున్నార‌న్న అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.