త్వరలో .. వైసీపీ తరఫున నాలుగు విప్ పదవులు రానున్నాయి. తాజా సమాచారం ప్రకారం కమ్మ సామాజికవర్గ నేతకు ఒకటి కేటాయించే అవకాశాలున్నాయి. మిగిలిన 3 కూడా గత ఎన్నికల్లో బలమైన నాయకులను ఢీకొన్న వారికే వరించనున్నాయి అని తెలుస్తోంది.
కొత్త పదవుల వేటలో వైసీపీ ఉంది. అదేవిధంగా పదవుల సంఖ్య పెంపుపై కూడా ఆసక్తిగా ఉంది. తాజా సమాచారం అనుసరించి శాసన సభలో విప్ -ల సంఖ్య పెంచేందుకు ముఖ్యమంత్రి జగన్ యోచిస్తున్నారు.
ఇప్పటిదాకా ఎనిమిది మందికి విప్ పదవులు, ఒకరికి చీఫ్ విప్ పదవి ఇచ్చే అవకాశం ఉందని, ఇప్పుడు తాజాగా 9 నుంచి పది వరకూ విప్ పదవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి దాకా విప్ గా ఉన్న బూడి ముత్యాల నాయుడును మంత్రిని చేశారు. డిప్యూటీ సీఎం ను కూడా చేశారు. అదేవిధంగా మరో విప్ దాడిశెట్టి రాజా ( ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, రాజా నగరం ఎమ్మెల్యే) ను కూడా ఆర్ అండ్ బీ మంత్రిని చేశారు.
దీంతో తాజాగా ఏర్పడ్డ రెండు ఖాళీలకు కొత్త ముఖాలు వెతకాలి. అదేవిధంగా మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో రగిలిపోతున్న వారికి ఉపశమనం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలి అని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో విప్ బరిలో చింతమనేని ప్రత్యర్థి అబ్బయ్య చౌదరికి ఉన్నారు అని తెలుస్తోంది.
ఇదేవిధంగా మరో పేరు కరణం ధర్మ శ్రీ (చోడవరం ఎమ్మెల్యే) పేరు వినపడుతోంది. ఈ రెండూ కాకుండా మరో రెండు పేర్లు కూడా ప్రముఖంగా ఉన్నాయి. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ కు కూడా కమ్మ సామాజికవర్గం కోటాలోనే విప్ పదవుల జాబితాలో చోటు దక్కవచ్చన్న ఆలోచన ఉంది.
ఇదేకోవలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పేరు కూడా విప్ జాబితాలో ఉండనుంది అని తెలుస్తోంది. పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబు రావు పేరు కూడా ఇదే కోవలో వినిపిస్తుంది.అంటే ఇప్పటిదాకా నెలకొన్న రెండు ఖాళీలు, వీటితో పాటు జాబితాలో ఉన్న ఎనిమిదిని కాస్త పది చేయడం ద్వారా వచ్చే అదనపు రెండు ఖాళీలు కలుపుకుని సెషన్లో ఫ్లోర్ కో – ఆర్డినేషన్ కోసం నలుగురు కొత్త ముఖాలు రానున్నాయి. విప్ పదవులు అందుకోనున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates