మరో ఏడాదిలోపు ఎన్నికలు జరగబోతున్న గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టిదెబ్బ తగిలింది. పటీదార్ సామాజకవర్గంలో గట్టి పట్టున్న హార్దిక్ పటేల్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేయటం ఒకనష్టమైతే పటేల్ తొందరలోనే బీజేపీలో చేరుతుండటం మోరో నష్టమనే చెప్పాలి. రిజర్వేషన్లకు ఒకపుడు పటీదార్లు చేసిన ఉద్యమం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది.
ఆ రిజర్వేషన్ల ఉద్యమంలో బాగా పాపులరైంది హార్దిక్ పటేలే. ఆ ఉద్యమంతోనే పటేల్ అన్నీపార్టీల దృష్టిని ఆకర్షించారు. యువనేతను చేర్చుకునేందుకు చాలాపార్టీలు ఉత్సాహం చూపించినా ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే చేరిన దగ్గరనుండి పటేల్ ఏదో ఒక అసంతృప్తితోనే ఉన్నాడు. తనకు పార్టీ నాయకత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వటంలేదని, తనను పట్టించుకోవటంలేదని చాలాసార్లు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తంచేశారు.
హార్దిక్ పటేల్ కు కావాల్సిందేమిటనే విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేకించి రాహుల్, ప్రియాంక గాంధీలు పట్టించుకున్నట్లులేదు. దాంతో పటేల్ తొందరలోనే కాంగ్రెస్ కు రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నా ఎవరు పట్టించుకోలేదు. దాన్ని అవమానంగా భావించిన పటేల్ ఇపుడు రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నారు. నిజానికి గుజరాత్ లో కాంగ్రెస్ అధికారం కోల్పోయి సుమారు 20 సంవత్సరాలవుతోంది. అంటే పార్టీ ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నదనే చెప్పాలి.
ఇలాంటి సమయంలో పటీదార్ల సామాజికవర్గంలో పట్టున్న యువనేతను నిర్లక్ష్యంతో వదులుకోవటం కాంగ్రెస్ పార్టీ తప్పనే చెప్పాలి. ఒకవైపు పటేల్ ను వదులుకుంటునే మరోవైపు పటీదార్లలో గట్టిపట్టున్న రాజేష్ పటేల్ ను పార్టీలోకి రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉన్నవాళ్ళను వదులుకోవటం ఎందుకు ? బయటవాళ్ళను పార్టీలో చేర్చుకునేందుకు అవస్తలు పడటం ఎందుకో అర్ధం కావటంలేదు. హార్దిక్ పటేల్ ను పిలిపించి ఆయన సమస్యేంటో కనుక్కునుంటే బాగుండేది. పార్టీలో ఇపుడున్న సీనియర్లతో కాంగ్రెస్ అధికారంలోకి రావటం జరిగేపనికాదని అర్ధమైపోయింది. యువతకు అత్యంత ప్రాధాన్యతని ఒకవైపు తీర్మానాలు చేసిన పార్టీ మరోవైపు యువనేతలు వెళ్ళిపోతున్నా పట్టించుకోపోవటమే విచిత్రంగా ఉంది.
This post was last modified on June 1, 2022 11:39 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…