Political News

కేసీఆర్ వెనుక ఉన్నది వాళ్లే.. రాహుల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సొంతపార్టీ నేతలకు రాహుల్ గాంధీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. గాంధీభవన్‌లో పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన రాహుల్.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే యుద్ధమని వెల్లడించారు. తెలంగాణను ఒక ఆదర్శంగా రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

కేసీఆర్‌ వెనుక ధనం, పోలీసులు ఉన్నారు కానీ.. ప్రజలు లేరని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణను ఒక ఆదర్శంగా రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. కాంగ్రెస్‌ ఏర్పాటు చేసేది నిరంకుశ ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. మెరిట్‌ ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇస్తామని తెలిపారు. ప్రజలు, రైతుల పక్షాన పోరాటం చేసేవారికే టికెట్‌ ఇస్తామని చెప్పారు.

స‌ర్వేతోనే టికెట్లు
సీనియర్లు అయినా సరే పార్టీ కోసం పనిచేయకుంటే టికెట్‌ రాదు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి గురించి సర్వే చేసి టికెట్లు కేటాయిస్తాం. వరంగల్‌ డిక్లరేషన్‌ గురించి ప్రతి వ్యక్తికి, ప్రతి రైతుకు తెలియజేయండి. వరంగల్‌ డిక్లరేషన్‌ గురించి చిన్నపిల్లలకు కూడా తెలియాలి. వరంగల్‌లో చెప్పింది డిక్లరేషన్‌ మాత్రమే కాదు.. ప్రజలు, కాంగ్రెస్‌ ప్రభుత్వం మధ్య ఒప్పందం.. అని రాహుల్ స్ప‌ష్టం చేశారు.

మీడియా ముందుకు రావొద్దు!
కుటుంబంలోని వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమన్న రాహుల్… తాను ప్రతి ఒక్కరి అభిప్రాయాలు, ఆలోచనలు వింటానని తెలిపారు. ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకుందాం కానీ.. మీడియా ముందు మాత్రం చెప్పొద్దని వెల్లడించారు. నేతలందరి కృషి వల్ల వరంగల్‌ సభ దిగ్విజయం అయ్యిందన్నారు. అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. కాంగ్రెస్‌పై గౌరవమున్న కార్యకర్తలు కోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు.

“రాష్ట్రంలో 8 ఏళ్లుగా అరాచక పాలన కొనసాగుతోంది. రాష్ట్ర సంపదనంతా ఒక కుటుంబం దోచుకుంటోంది. విద్యం, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రజలకు న్యాయం జరగలేదు. కేసీఆర్‌ కుటుంబం నుంచి తెలంగాణను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో యువత కదిలిరావాలి. ఎన్నో ఆశయాలతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఇన్నేళ్లలో ప్రజలు, సోనియాగాంధీ అనుకున్నది రాష్ట్రంలో జరగలేదు. అందరి ఆకాంక్షలు నెరవేరాలంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి ” అని రాహుల్ పిలుపునిచ్చారు.

నో.. బ్యాక్‌డోర్ టికెట్స్‌!
హైదరాబాద్‌లో కూర్చున్నా… ఢిల్లీ చుట్టూ తిరిగితే టికెట్లు రావని కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్ ఇచ్చారు. తనకు హైదరాబాద్ బిర్యానీ, ఛాయ్ ఎంత బాగుంటుందో తెలుసని చెప్పిన రాహుల్… టికెట్‌ దక్కాలంటే హైదరాబాద్‌ను వదిలి గ్రామాల్లోకి వెళ్లాలని సూచించారు. వెనుక డోర్‌ నుంచి టికెట్ తెచ్చుకుంటామనుకునే వాళ్లు ఆశలు వదులుకోవాలని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

This post was last modified on May 7, 2022 10:11 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

2 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

3 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

3 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

3 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

5 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

6 hours ago