స్టార్ హీరోలు కూడా వరుసగా ఫ్లాపులు వస్తే తట్టుకోలేరు. మార్కెట్ డౌన్ అవుతుంది. బడ్జెట్లు తగ్గిపోతాయి. పేరున్న దర్శకులు ఆ హీరోలతో పని చేయడానికి వెనుకాడతారు. అవకాశాలు తగ్గడం మొదలవుతుంది. ఐతే యువ కథానాయకుడు సందీప్ కిషన్‌కు ఇలాంటివేమీ వర్తించవేమో అనిపిస్తుంది. అతడి కెరీర్ సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ. చివరగా అతను ఎప్పుడు నిఖార్సయిన హిట్టు కొట్టాడో తన అభిమానులకు కూడా గుర్తుండకపోవచ్చు.
వరుసబెట్టి ఫ్లాపుల మీద ఫ్లాపులు ఇస్తున్నా.. ఎప్పటికప్పుడు అతడి స్థాయికి మించిన ప్రాజెక్టులు సెట్ అవుతూనే ఉంటాయి. అవకాశాలకు కొదవే ఉండదు. కరెక్టుగా చెప్పాలంటే సందీప్ కెరీర్లో నిఖార్సయిన హిట్టు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మాత్రమే. ఆ సినిమా 2013లో రిలీజైంది. తర్వాతి తొమ్మిదేళ్లలో టైగర్, నిను వీడని నీడను నేనే లాంటి కొన్ని సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి. అవి కూడా నిఖార్సయిన హిట్లు కావు.
చివరగా సందీప్ చేసిన తెనాలి రామకృష్ణ, ఎ1 ఎక్స్‌ప్రెస్ నిరాశపరిచాయి. అయినా ఇప్పుడు సందీప్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అవి స్టార్ హీరోలు చేసే రేంజివి. శనివారం సందీప్ పుట్టిన రోజు సందర్భంగా మైకేల్ అనే తమిళ, తెలుగు చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అది తమిళంలో పేరున్న నిర్మాతలు మంచి బడ్జెట్లో చేస్తున్న సినిమా. అందులో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ లాంటి ఆర్టిస్టులు కీలక పాత్రలు చేస్తున్నారు. కాస్టింగ్, బడ్జెట్ చూస్తే ఇది పెద్ద రేంజి సినిమాలాగే ఉంది.
మరోవైపు వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఊరు పేరు భైరవపురం అనే సందీప్ కొత్త సినిమా టీజర్ లాంచ్ చేశారు ఈ రోజు. అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆ సినిమా రేంజ్ కూడా పెద్దగానే కనిపిస్తోంది. మరి ఫ్లాపుల ప్రభావం లేకుండా సందీప్ ఇలా మంచి మంచి ప్రాజెక్టులు దక్కించుకుని, తన స్థాయికి మించిన బడ్జెట్లలో ఈ సినిమాలు ఎలా చేయగలుగుతున్నాడో ఇండస్ట్రీ జనాలకు అర్థం కావడం లేదు.
This post was last modified on May 7, 2022 10:15 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…