ఏపీలో కొత్తగా వచ్చిన జగన్ 2.0 కేబినెట్‌లో మళ్లీ అవకాశం దక్కించుకోవడాన్ని మంత్రులు అదృష్టంగా భావిస్తున్నారు. ఇక, తమకు అవకాశం దక్కలేదని ఇప్పటికీ బాధపడుతున్న వారు కూడా కనిపిస్తున్నారు. అయితే.. రెండోసారి కూడా అవకాశం దక్కించుకున్నవారు.. తమ పనితీరును చూసి.. జగన్ అవకాశం ఇచ్చారని.. భావిస్తున్నారా? లేక.. కేవలం దేవుడిని నమ్ముకుంటే.. అవకాశం దక్కిందని అనుకుంటున్నారా? నిజానికి దైవబలం అందరికీ అవసరమే. అయితే.. కష్టాన్ని కూడానమ్ముకోవాలికదా!
ఈ విషయంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి మరోసారి అవకాశం దక్కించుకున్న చెల్లుబోయిన వేణు కు సంబంధించి తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకంటే.. ఆయనకు మరోసారి జగన్ అవకాశం ఇచ్చారు. శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని అక్కున చేర్చుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా మరోసారి ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఆయన ఎలా పనిచేయాలి? ఏవిధంగా తన శాఖను అభివృద్ధి చేయాలి? అనేది చర్చకు వస్తోంది. కానీ, ఈ విషయాన్ని.. చెల్లుబోయిన పక్కన పెట్టారు.
ప్రస్తుతం సమాచార, ప్రసారశాఖలతోపాటు.. బీసీ సంక్షేమ శాఖను కూడా ఆయనకే జగన్ అప్పగించారు. సరే.. సమాచార శాఖలో అంటే.. పని ఏముంటుంది? అని సరిపెట్టుకుందాం. కానీ, బీసీ సంక్షేమం అంటే.. నాలుగు చేతులతో చేసినా.. వచ్చే రెండేళ్లపాటు ఇంకా మిగిలిపోయేంత పని ఉంది. ముఖ్యంగా బీసీలను పార్టీకి చేరువ చేయడం.. బీసీ హాస్టళ్ల పనితీరు.. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు.. బీసీలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు వారికి చేరువ చేయడం.. ఇలా అనేకం ఉన్నాయి.
అయితే.. వీటిని ఆయన ఏమీ పట్టించుకోవడం లేదు. మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి.. ఈ నెల 28(గురువారం) నాటికి 16 రోజులు అయింది. ఈ 16 రోజుల్లో ఆయన ఏం చేశారంటే.. 7 రోజుల పాటు.. తిరుమల శ్రీవారికి మొక్కడానికే సరిపెట్టారు. మంత్రికాగానే వెళ్లిపోయారు. మూడు రోజులు అక్కడే తిష్టవేసి.. ఉదయం సాయంత్రం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇక, ఇప్పుడు ఏకంగా.. తూర్పులోని.. మరో ఇద్దరు కీలక నాయకులను వెంటేసుకుని.. నాలుగు రోజుల ట్రిప్ కోసం. తిరుమల వెళ్లిపోయారు. మరి ఇది ఎంత వరకు సమంజసం? అనేది కీలక ప్రశ్న. భక్తి ఉండొచ్చు. కానీ, బాధ్యతలు అంతకన్నా ముఖ్యం కదా మంత్రి వర్యా!! అంటున్నారు నెటిజన్లు.
This post was last modified on April 28, 2022 11:50 pm
సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ… తన పేరు ముందు ఉన్న బిరుదు మాదిరిగా ప్రతి విషయాన్ని సెన్సేషనల్ గానే చేసుకుంటూ…
ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం టీమ్ బాక్సాఫీస్ సంభవం పేరుతో ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడితో…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి, ఫలితాలు తేలిపోయాయి కాబట్టి మూవీ లవర్స్ ఫ్రెష్ గా రిలీజయ్యే…
అవును.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ఈ అంశంపై ఎవరు వస్తారన్న దానిపై ఇప్పటివరకున్న కన్ఫ్యూజన్ ఒక…
ఎంత తలలు పండిన దర్శకులైనా రెండు మూడు హిట్లు పడ్డాక ఫ్లాపులు చూడటం సహజం. కెవి రెడ్డి, మణిరత్నం దగ్గర…
గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు…