జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతుల నుంచి నీటి తీరువా వసూలును పవన్ కళ్యాణ్ ఖండించారు. నీటి తీరువా వసూలు విషయంలో ప్రభుత్వానిది అప్రజాస్వామిక విధానమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా టార్గెట్ పెట్టి మరీ నీటి పన్నులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చిన్నసముద్రం అనే చిన్నగ్రామానికి రూ.29 లక్షలు టార్గెట్ పెట్టారని విమర్శించారు. 2018 నుంచి లెక్కగట్టి 6 శాతం వడ్డీతో వసూలు చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి పాలన చేస్తున్నారా?, వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
ఆస్తిపన్ను చెల్లించలేదని గతనెలలో ఇళ్లకు తాళాలు వేశారని…నెలలు గడిచినా రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించలేదని దుయ్య బట్టారు. ఇలా చేయడం వల్ల.. రైతులు వ్యవసాయం చేయడం కన్నా.. ఆత్మహత్యలే మేలని భావిస్తారని అన్నారు. ఇప్పటికైనా.. సీఎం జగన్ తన తీరును మార్చుకుని.. ప్రజలపై భారాలు మోపే విధానానికి స్వస్థి పలకాలని పవన్ వ్యాఖ్యానించారు. ఇక, తిరుపతి రుయా ఆస్పత్రి అంబులెన్స్ ఘటనపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రూయా ఆస్పత్రి ప్రభుత్వానిదా? వైసీపీదా? అని ప్రశ్నించారు. రూయా ఆస్పత్రిలో సైకిల్ పార్కింగ్ నుండి ప్రతి టెండర్ వైసీపీ నాయకులదే అని అన్నారు.
అంబులెన్స్ ఘటన సమయంలో ప్రభుత్వ అంబులెన్స్‌లు ఏమయ్యాయో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంబులెన్స్ మాఫియాలో వైసీపీ కార్పొరేటర్లకు వాటాలు వెళ్తున్నాయని ఆరోపించారు. తిరుపతి నగరంలో వైసీపీ కార్పొరేటర్లు రూ.50ను కూడా వదలడం లేదని అన్నారు. అంబులెన్స్ ఘటనలో బాధ్యులను చేసి ఆర్ఎంఓ సరస్వతి దళితురాలు కాబట్టి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. రూయా ఆర్ఎంఓ అగ్రవర్ణాలకు చెందిన ఆమె కాదు.. కాబట్టే సస్పెండ్ చేశారని విమర్శించారు.
రూయా ఆస్పత్రికి ఆధార్ కార్డుతో వెళితే.. డెత్ సర్టిఫికేట్ ఇచ్చి పంపే పరిస్థితి ఏర్పడిందన్నారు. రూయా ఆస్పత్రికి ఎవరైనా చికిత్స కోసం వస్తే కొందరు సిబ్బంది రోగులను బయట ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని తెలిపారు. రిఫర్ చేసిన ఆస్పత్రుల నుండి కమీషన్ గుంజుతున్నారన్నారు. రూయా ఆస్పత్రిని వైసీపీ ఆస్పత్రిగా మార్చవద్దని కోరారు.
This post was last modified on April 28, 2022 7:42 am
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…