వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మందికి ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. పపార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కూడా వీరు గట్టివాయిస్ వినిపించారు. మీడియా ముందు.. తీవ్ర వ్యాఖ్యలు చేసి.. నిరంతరం ట్రోల్ అయ్యారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్.. సహా.. జనసేనపై విరుచుకుపడేవారు. ఇలాంటి వారిలో ఒకరిద్దరు మరింత పేరు తెచ్చుకున్నారు. వీరిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నగరి ఎమ్మెల్యే రోజా కీలక పాత్రలో కనిపించేవారు.
ఆమె నోరు విప్పితే సంచలన కామెంట్లు అలవోకగా వచ్చేవి. సవాళ్లకు, ప్రతిసవాళ్లకు కూడా ఆమె కీలకంగా మారేవారు. దీంతో రోజా రేంజ్ ఓ రేంజ్‌లో సాగింది. ఇక, తనకు ఇబ్బంది వచ్చినా. ఆమె అదే రేంజ్‌లో రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. తన నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయాలపైనా.. ఆమె.. సంచలన వ్యాఖ్యలు చేసేశారు. అయితే.. ఇప్పుడు రోజాకు జగన్ ప్రమోషన్ ఇచ్చారు. తన కేబినెట్ 2.0లోకి రోజాను తీసుకున్నారు. ఇలా ఎందుకు చేశారంటే… మరింతగా ప్రోత్సహించేందుకేనని అంటున్నారు.
అయితే.. దీనికి భిన్నంగా రోజా .. ఇప్పుడు ఎక్కడా మీడియా ముందుకు రావడం లేదు. మంత్రివర్గంలో చోటు ఇచ్చి.. ఇప్పటికి 15 రోజులు అయింది. ఇన్నిరోజుల్లో ఎక్కడా ఆమె.. మీడియా ముందుకు రావడం కానీ, గతంలో మాదిరిగా.. ప్రతిపక్షాలపై విరుచుకుపడడం కానీ.. కనిపించడం లేదు. ఈ పదిహేను రోజుల్లో రాష్ట్రంలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి.. ఒంగోలులో ఓ కుటుంబం వెళ్తున్న కారును ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకోవడం అయితే.. రెండోది విజయవాడలో ఓ యువతిపై అత్యాచారం ఘటన.
ఈ రెండు విషయాలపైనా.. ప్రతిపక్షం టీడీపీ నిప్పులు చెరిగింది. జగన్ అసమర్థపాలకుడంటూ.. కామెంట్లు చేసింది. అంతేకాదు.. ఆయన తక్షణం పదవికి రాజీనామా చేయాలని కూడా వ్యాఖ్యానించింది. నిజానికి వైసీపీని, జగన్‌ను ఏమైనా అంటే.. అస్సలు ఊరుకోని.. రోజా.. ఇప్పుడు ఎక్కడా కనిపించలేదు. పోనీ నామమాత్రంగా కూడా స్పందించలేదు. దీంతో మంత్రి అయ్యాక ఆమె మారిపోయారబ్బా! అనే మాట వినిపిస్తోంది. దీనికి కారణం ఏంటి? అనేది కూడా ఆసక్తిగా మారింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. పరిస్థితి వేరు.. ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు! అని తనను తాను ఆమె మార్చుకున్నారేమో.. అనే గుసగుస వినిపిస్తోంది.
This post was last modified on April 25, 2022 11:01 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…