పజిల్ వీడిపోయింది. మాటలు చెప్పడానికి వాటిని ఆచరించటానికి మధ్య అంతరం ఎంతలా ఉంటుందన్న విషయంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజా పరిణామాలు ఫుల్ క్లారిటీని ఇస్తాయన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకు జగన్ కు తిరుగులేదు.. ఆయన మాటకు ఎదురే లేదన్నట్లుగా అనుకున్న దానికి భిన్నంగా.. ఆయనకు పరిమితులు ఉన్నాయన్న విషయం తాజా పరిణామాలు స్పష్టం చేశాయి.
కాబినెట్ మార్పు విషయంలో అంతా తన మాటే ఫైనల్ అన్నట్లుగా చెప్పినప్పటికీ వాస్తవంలో మాత్రం అలాంటిదేమీ లేకపోవటమే కాదు.. కొన్ని సందర్భాల్లో వెనక్కి తగ్గిన వైనం చూసినప్పుడు జగన్ కు తొలిసారి తనకున్న పరిమితులు ఏమిటన్న విషయం మీద స్పష్టత వచ్చిందంటున్నారు.
పునర్ వ్యవస్థీకరణకు ముందు వరకు రింగు మాష్టర్ మాదిరి కనిపించిన జగన్.. తాజా ప్రక్రియ అనంతరం ఆయన తీరు భిన్నంగా మారిందంటున్నారు. రింగు మాస్టర్ గా ఉండి అందరిని ఆడించాల్సిన జగన్.. అందుకు భిన్నంగా కొందరు నేతలు చెప్పినట్లు ఆడాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. ఈ పరిణామం మొత్తం చూసినప్పుడు పునర్ వ్యవస్థీకరణ తేనెతుట్టెను కదిపి జగన్ పెద్ద తప్పు చేశారా? అన్న భావన కలుగక మానదు. తిరుగులేని అధికారం చేతిలో ఉన్నా.. దాన్ని పూర్తిగా వాడలేని పరిస్థితి చూస్తే.. చేతులారా చేసుకున్నారే అన్న భావన కలుగక మానదు.
ఇక.. జగన్ 2.0లో కేబినెట్ లోకి వచ్చిన కొత్త మంత్రులు ఎవరు? ఔట్ అయిన పాత మంత్రులు ఎవరు?జగన్ పెట్టిన పరీక్షలో నిలిచి.. సేఫ్ గా కేబినెట్ లో కొనసాగుతున్నదెవరు? అన్న వివరాల్లోకి వెళితే..
కొత్త మంత్రులు వీరే
1) ధర్మాన ప్రసాదరావు
2) పీడిక రాజన్నదొర
3) గుడివాడ అమర్‌నాథ్
4) బూడి ముత్యాలనాయుడు
5) దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)
6) కారుమూరి వెంకట నాగేశ్వరరావు
7) కొట్టు సత్యనారాయణ
8) జోగి రమేశ్
9) అంబటి రాంబాబు
10) మేరుగ నాగార్జున
11) విడదల రజని
12) కాకాణి గోవర్ధన్ రెడ్డి
13) ఆర్.కె.రోజా
14) ఉష శ్రీ చరణ్
ఔట్ అయిన మంత్రులు
1) ధర్మాన కృష్ణదాసు
2) పుష్ప శ్రీవాణి
3) అవంతి శ్రీనివాస్
4) కురసాల కన్నబాబు
5) ఆళ్ల నాని
6) చెరుకువాడ శ్రీరంగనాథరాజు
7) పేర్ని నాని
8) కొడాలి నాని
9) వెలంపల్లి శ్రీనివాస్
10) మేకతోటి సుచరిత
11) బాలినేని శ్రీనివాసరెడ్డి
12) అనిల్ కుమార్ యాదవ్
13) శంకరనారాయణ
కొత్త కేబినెట్ లో కొనసాగుతున్న పాత మంత్రులు వీరే
- సీదిరి అప్పలరాజు
- బొత్స సత్యనారాయణ
- పినిపే విశ్వరూప్
- చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
- తానేటి వనిత
- ఆదిమూలపు సురేశ్
- అంజాద్ బాషా
- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
- గుమ్మనూరు జయరాం
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- కె.నారాయణస్వామి