టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్.. నోటి నుంచి ఎవరూ ఊహించని మాట వచ్చింది. ఇప్పటి వరకు ఆయన ఏపీ సీఎం జగన్‌పై విమర్శుల చేయడం.. సవాళ్లు విసరడం తెలిసిందే. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను కూడా ఆయన ఎండగడుతున్నారు. తరచుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. వారి సమస్యలు కూడా వింటున్నారు. ఈ క్రమంలో జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే.. తాజాగా నారా లోకేష్.. జగన్ గత ఎన్నికలకు ముందు చేసిన ప్రకటన ఏదైతే ఉందో.. దానపై వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ.. ప్రజలు అభ్యర్థించారు.
వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికలలో తనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండని మంగళగిరి నియోజకవర్గ ప్రజలను నారా లోకేష్ అభ్యర్థించారు. ఇప్పటి వరకు ఒక ఎత్తు.. తనకు ఛాన్స్ ఇచ్చిన తర్వాత.. మరో ఎత్తు, అనే విదంగా నియోజకవర్గాన్ని మారుస్తానని అన్నారు. అంతేకాదు.. స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న ఆయన.. తిరుపతి వెంకన్న దర్శనం అయినా.. అవుతుందని.. కానీ, స్థానిక ఎమ్మెల్యే మాత్రం కనిపించడం లేదని.. ఫైరయ్యారు. మంగళగిరిలో అనేక సమస్యలు ఉన్నాయని.. తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే.. అన్ని సమస్యలను పరిష్కరించి.. హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తానని.. హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో లోకేష్ మరోసారి.. సీఎం జగన్‌పై.. ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ మూడేళ్లలో జగన్ కేబినెట్ ఏం పీకిందని ఆయన మండిపడ్డారు. వచ్చే కొత్త క్యాబినెట్ ఏం పీకుతుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఉన్న మంత్రుల్లో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా? అని నిలదీశారు. అందరూ బిక్కు బిక్కు మంటూ.. కాలం వెళ్లబుచ్చారని.. కనీసం మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం జగనేనని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయనలో రౌడీ లక్షణాలు పెరిగాయని ఆరోపించారు. ఇదే పరిస్థితి ప్రజలకు ప్రాణ సంకటంగా మారిందన్నారు. ప్రతిదానికీ కేసులు పెట్టడం.. వేధించడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.
ఇప్పుడు ఆలిబాబా 25 దొంగలు!
జగన్ కొత్త కేబినెట్‌పై టీడీపీ ఫైర్ బ్రాండ్ బుద్దా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆలిబాబా 25 దొంగలుగా ఏపీ కొత్త కేబినె ట్‌ను పోల్చారు. చిన్నప్పటి ఆలీబాబా 40 దొంగల కథ కంటే, జగన్ బాబా 25 దొంగల కథ ప్రజల నాలుకలపై బాగా ప్రాచుర్యం పొందిందని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. కొబ్బరిచిప్పల దొంగకు దేవాదాయశాఖ ఇస్తే, కోట్లుకొట్టేశాడని ఆయన ఆరోపించారు. నేరచరిత్రలో ఆరితేరిన జగన్, ఎవరు ఏశాఖలో నిపుణులో ఆలోచించి మరీ వారికి సరిపోయే శాఖలిచ్చాడన్నారు.
`వెల్లంపల్లి పెడతాడు పెద్దబొట్టు… దేవుని సొమ్ము కాజేయకుంటే ఒట్టు` అన్నారు. వెల్లంపల్లిని కేబినెట్ నుండి తీసేసే ముందు అతను దొంగలించిన రూ.1,525 కోట్లు జగన్ రెడ్డి కక్కించాలని డిమాండ్ చేశారు. ఊసరవెల్లి మార్చే రంగులకంటే వెల్లంపల్లి మార్చే రంగులు కోకొల్లలని విమర్శించారు. పార్టీ జెండాలు మార్చడంలో వెల్లంపల్లిని మించినవారు భూమ్మీదే ఉండరన్నారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీల నుంచి జగన్ పంచనచేరి, ప్రజలకు పంగనామాలు పెట్టాడని వెలంపల్లిపై విమర్శలు గుప్పించారు.