మహమ్మారి వైరస్ 213 దేశాలపై పంజా విసిరింది. ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మంది ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. కరోనా బారినపడి 4,63,465 మంది చనిపోయారు. భారత్ లో కరోనా కేసులు 3,80,532కు చేరాయి. మనదేశంలో 12,573 మంది కరోనా బారిన పడి మరణించారు. కొవిడ్-19కు సంబంధించి తాజా గణాంకాలను అందించే అంతర్జాతీయ సంస్థ ‘వరల్డో మీటర్’ ప్రకారం పలు ఆసక్తికర గణాంకాలు వెల్లడయ్యాయి. కోవిడ్-19 మరణాల్లో తొలి స్థానంలో అమెరికా ఉండగా…8వ స్థానంలో భారత్ ఉంది. ప్రతి 10 లక్షల మంది జనాభాకు సంభవించిన కొవిడ్-19 మరణాలలో దక్షిణ యూరోప్‌లోని అతిచిన్న దేశం సాన్ మారినో తొలిస్థానంలో నిలిచింది. 61 చ.కి.మీ వైశాల్యం, 34వేల కన్నా తక్కువ జనాభాగల ఈ దేశం అనూహ్యంగా తొలి స్థానంలో ఉండడం విశేషం. అయితే, కరోనా విలయతాండవం చేసిన ఇటలీ సమీపంలో ఉండటం సాన్ మారినోపాలిట శాపంమైంది. ఇతర దేశాలతో పోలిస్తే ప్రతి 10 లక్షల జనాభాకు కరోనా మరణాల సంఖ్య భారత్ లో తొమ్మిదిగా ఉంది. ఈ విషయంలో ప్రపంచ జాబితాలో భారత్ 106వ స్థానంలో ఉంది.
కోవిడ్-19 మరణాల్లో తొలి 8 స్థానాల్లో ఉన్న దేశాలు (సంఖ్యా పరంగా)
అమెరికా( 1,20,688 )
బ్రెజిల్ (47869)
బ్రిటన్ (42288)
ఇటలీ (34515)
ఫ్రాన్స్ (29603)
స్పెయిన్ (27136)
మెక్సికో (19749)
భారత్ (12,573)
ప్రతి 10 లక్షల మంది జనాభాకు సంభవించిన మరణాల ప్రకారం…
సాన్ మారినో (1,238)
బెల్జియం (836)
అండోరా (673)
బ్రిటన్ (623)
స్పెయిన్ (580)
ఇటలీ (571)
స్వీడన్ (500)
ఫ్రాన్స్ (454)
అమెరికా (365)
నెదర్లాండ్స్ (355)
భారతదేశం (9)
అంటే మనదేశంలో ఈ పాండెమిక్ తీవ్రత మరణాల పరంగా తక్కువ అనుకోవాలన్నమాట.