టీడీపీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా భాగ్య నగరి వీధుల్లో పసుపు కళకళలు చాలా రోజులకు తళుకులీనాయి. ఎన్టీఆర్ భవన్ కేంద్రంగా చంద్రబాబు ప్రసంగించారు. కార్యకర్తలలో ఉత్సాహం నింపేందుకు ఏడు పదుల వయస్సులోనూ అంటే 70 ఏళ్ల వయస్సులోనూ ఆయన ఎంతో ప్రయత్నించారు. శ్రేణులలో ఉత్సాహంతో పాటు కార్యాచరణను పెంపొందించేందుకు కూడా చంద్రబాబు ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇవాళ కూడా శ్రమించారు కూడా! ఆయన అంతర్మథనంలో భాగంగా పార్టీకి సంబంధించి నాలుగు కాదు నలభై మాటలు వెలుగు చూశాయి.
ఇక మూడు నలభైల గురించి చెప్పుకుందాం
ఒక వేడుకలు 40 దేశాలలో 400 నగరాల్లో ప్రపంచ వ్యాప్తంగా జరిగాయి. ఆవిధంగా ఓ వండర్. వివిధ దేశాల్లో ఎన్ఆర్ఐలు ముఖ్యంగా ఇక్కడి నుంచి తరలిపోయిన ఆంధ్ర ప్రదేశ్ మూలాలు ఉన్న కుటుంబాలు ఇవాళ వేడుకలు చేసుకున్నాయి. వివిధ సామాజిక వర్గాలకు చెందిన సమూహాలు ప్రాంతాలకు అతీతంగా ఈ వేడుకల్లో అమితోత్సాహంగా పాల్గొన్నాయి. పార్టీ పునర్నిర్మాణానికి అంతా భాగస్వామ్యం వహించాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపును అందుకుని తమ సానుకూలతను ఆన్లైన్ మాధ్యమాల ద్వారా వెల్లడించాయి.
మరో 40 : వచ్చే ఎన్నికల్లో యువతకు నలభై శాతం టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనలో దాగి ఉన్న రాజకీయ ప్రయోజనం ఎంతన్నది తరువాత కాలంలో తేలిపోనుంది. కానీ పాత నీరు పోయి కొత్త నీరు వస్తే మేలే కదా అన్న భావన మాత్రం సుస్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అశోక్ గజపతి రాజు పోటీ చేయరు. అదేవిధంగా చాలా మంది సీనియర్లు అస్త్ర సన్యాసం చేయనున్నారు. ఉన్నంతలో కూడబెట్టుకున్న ఆస్తులు చాలు అన్న నిర్వేదంతో కూడా కొందరు సీనియర్లు సైడ్ అయిపోతున్నారు. ఇంకొందరు జగన్ హవాలో తట్టుకుని నిలబడడం కష్టమని కూడా తలుచుకుని సైడ్ ఇస్తున్నారు. అయితే వీళ్లంతా పార్టీని ఆర్థికంగా ఆదుకునే అవకాశాలు కూడా తక్కువే! అందుకే కొత్త ముఖాలు తెరపైకి తెచ్చి తెర వెనుక అంతా తానై కథ నడపాలన్నది బాబు ప్లాన్. గతంలో ఇదే ఫార్ములాను ఎన్టీఆర్ ఎప్లై చేశారు.
జనసేన కూడా ఎప్లై చేసినా సక్సెస్ కాలేదు. పీఆర్పీ టైంలో చిరు కూడా కొన్ని కొత్త ముఖాలు ఛాన్స్ ఇచ్చినా ఫలితం లేదు. ఈ దశలో వైసీపీ కూడా గతంలో కొన్ని కొత్త ముఖాలకు ఛాన్స్ ఇచ్చింది.ఆ క్రమంలోనే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ లాంటి వారు సీన్లోకి వచ్చి రాజకీయాలను ఏ విధంగా దిగజారుస్తున్నారో కూడా చూస్తున్నాం. ఇక ఇదే క్రమంలో గతంలో కొత్త ముఖాలుగా వచ్చిన ఎర్రన్న, యనమల లాంటి లీడర్లు, దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వరరావు లాంటి లీడర్లు ఆరోజు తమ సత్తా చాటినవారే ! కనుక ఈ ఫార్ములా అన్ని వేళలా కాకపోయినా కొన్ని సందర్భాల్లో సక్సెస్ కావడం ఖాయం.ఇక మొదటి నలభై.. నలభై వసంతాల పార్టీ..