టీడీపీ పార్లమెంటు సభ్యుడు(గుంటూరు).. గల్లా జయదేవ్ పార్లమెంటులో చాలా రోజుల తర్వాత.. మరోసారి అమరావతి ప్రస్తావన తెచ్చారు. గతంలో ఒకసారి.. అమరావతి గురించి మాట్లాడిన ఆయన మిస్టర్ పీఎం అంటూ.. మోడీని కడిగేశారు. తర్వాత.. మళ్లీ ఎందుకో ఆయన సైలెంట్ అయ్యారు. తర్వాత.. ఇన్నాళ్లకు మరోసారి.. పార్లమెంటులో గల్లా గట్టిగానే అమరావతి గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా 2022-23 వార్షిక బడ్జెట్‌లో కేంద్రం.. అమరావతికి జరిపిన కేటాయింపులపై పెదవి విరిచారు.
కేంద్ర బడ్జెట్లో అమరావతికి సరిపడా నిధులు కేటాయించలేదని జయదేవ్ అసహనం వ్యక్తం చేశారు. అమరావతిని అభివృద్ధి చేసేలా కేంద్రం సహకరించాలని సభలో విన్నవించారు. అమరాతి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని న్యాయస్థానం ఆదేశించినా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించినా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు.
రాజ్యాంగాన్ని అతిక్రమించి.. చట్టాలు చేసే అధికారం అసెంబ్లీ, పార్లమెంట్కు లేదన్నారు. అదే విధంగా కేంద్ర బడ్జెట్లో అమరావతికి సరిపడా నిధులు కేటాయించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. “శాసనవ్యవస్థ కంటే కూడా రాజ్యాంగం ఎంతో అత్యుత్తమైనది. ఏపీ రాజధాని అమరావతి అని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్టం, మాస్టర్ ప్లాన్ ప్రకారం.. అమరాతిని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లోపు అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ప్రభుత్వం ఏ ఒక్క పనిని మొదలుపెట్టలేదు.“ అని గల్లా ఆందోళన వ్యక్తం చేశారు.
అదే విధంగా కేంద్ర బడ్జెట్లో అమరావతికి సరిపడా నిధులు కేటాయించకపోవడం నిరాశపరిచింది. ఇప్పటికైనా అమరావతికి సరిపడా నిధులు కేటాయించి అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని గల్లా అన్నారు. ఇక, వికేంద్రీకరణ పేరుతో జగన్ రెడ్డి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. శాసనసభలో మూడు రాజధానులపై జగన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలూ ముక్తకంఠంతో ఖండించారు. రాష్ట్రంలో రోడ్ల మీద పడిన గుంతల్లో మూడు గుంతలు కూడా మరమ్మతు చేయలేని జగన్ రెడ్డి.. మూడు రాజధానులు ఎలా కడతారని.. టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. అభివృద్ధి గురించి మాట్లాడే నైతికహక్కు జగన్ మోహన్ రెడ్డికి లేదని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates