జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కేంద్రానికి భారీ షాక్ ఇచ్చారు. పరోక్షంగా కేంద్రంపై ఆయన విరుచుకుపడ్డారు. నేతాజీ అస్తికలు మన దేశానికి తీసుకురావాలని ప్రజలు కోరుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. నేతాజీ అస్తికలు రెంకోజి ఆలయంలో దిక్కు లేకుండా పడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అస్తిక లు నేతాజీవి అవునా కాదా అని పరీక్షలు చేయలేరా అని పవన్‌కల్యాణ్ పరోక్షంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును ప్రశ్నించారు. ఇప్పటికి మూడుసార్లు ప్రయత్నించినా కుదరలేదన్నారు.
నేతాజీని గౌరవించుకోకపోతే మనం భారతీయులమే కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వంద రూపాయల నోటుపై నేతాజీ బొమ్మ వేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. జైహింద్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని పవన్ కొనియాడారు. నేతాజీ లాంటి మహాత్మున్ని గౌరవించుకోక పోతే మనం భారతీయులమే కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. #BringbackNetajiAshes బ్రింగ్ బ్యాక్ నేతాజీ యాసెస్ హ్యాష్ ట్యాగ్‌ను ఆయన పంచుకున్నారు.
ప్రస్తుతం ఈ దేశం నాదనుకునే ఒక్క నాయకుడు లేడని పరోక్షంగా మోడీని టార్గెట్ చేశారు. నేతాజీ కోసం కొత్త తరం కదలి రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. కాగా, సినిమా ఉచితంగా చేస్తానేమో కానీ పుస్తకాలను మాత్రం ఇవ్వనని జనసేన అధినేత పవన్ అన్నారు. త్రివిక్రమ్ వస్తున్నాడంటే పుస్తకాలను దాచేస్తానని చమత్కరించారు. నేను సినిమా నటుడు అవ్వాలని అనుకోలేదని.. అలాగే ప్రజా సేవలోకి రావాలని కూడా ఊహించలేదన్నారు.
పవన్‌కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యుమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన నేతాజీ గ్రంథ సమీక్షలో ఆయన పాల్గొన్నారు. నేతాజీ గ్రంథ సమీక్ష పుస్తకాన్ని రచించిన ఎంవీఆర్ శాస్త్రిని ఇప్పటివరకు మూడుసార్లు కలిశానని పవన్ కల్యాణ్ తెలిపారు. కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సమయంలో శాస్త్రితో పరిచయం ఏర్పడిందన్నారు.
మన నుడి-మన నది కార్యక్రమంలో మరోసారి కలిసినట్లు వెల్లడించారు. ఇప్పుడు ఈ పుస్తక సమీక్షలో మళ్లీ కలిశానని తెలిపారు. ఎంవీఆర్ శాస్త్రి దాదాపు 20 పుస్తకాలు రచించారని పవన్‌కల్యాణ్ ప్రశంసించారు. అనంతపద్మనాభ స్వామి నేలమాలిగల్లో ఉన్న సంపద కంటే గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలకే ఎక్కువ విలువైనవని తెలిపారు. దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తుల జీవితాలను చదవడం వల్లే నాకు జీవితం అంటే ఏందో అర్థమైందన్నారు.
This post was last modified on March 25, 2022 11:30 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…