ఏపీ ప్రధాన పప్రతిపక్షం టీడీపీ వచ్చే ఎన్నికలపై తీవ్రస్తాయిలో కసరత్తు చేస్తోంది. ఎలా వెళ్లాలి? ఏవిధంగా పోటీ చేసి విజయం దక్కించుకోవాలి? వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలా గద్దె దింపాలి? అనే అంశాలపై తీవ్రం గానే ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకునేందుకుపా ర్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే.. మెజారిటీ తమ్ముళ్లు మాత్రం.. వద్దని అంటున్నారు. అందునా.. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే.. మేం పార్టీ ని గెలిపించుకుంటాం! అనే వాదన వినిపిస్తోంది.
మరి దీనికి కారణాలు ఏంటి? చంద్రబాబు ఎందుకు జనసేనతో పొత్తులు పెట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. అంటే.. ఒకటి.. తమ్ముళ్లలో కసిపెరిగింది. పార్టీ నేతలపై ప్రభుత్వం చేస్తున్న దాష్టీకాలు కానీ, పోలీసులు పెడుతున్న కేసులు కానీ.. కార్యకర్తలను తీవ్రంగా బాధిస్తోంది. అదేసమయంలో ద్వితీయ శ్రేణి నాయకులను కూడా ఈ పరిణామం ఇబ్బందులు పెడుతోంది. ఈ నేపథ్యంలోనే వారు.. ఇక, పార్టీని అధికారంలోకి తెచ్చు కునే సమయం వచ్చిందని అంటున్నారు.
ఇదే కసితో వారు పనిచేసేందుకు కూడా రెడీ అవుతున్నారు.. అందుకే.. ఎలాంటి పొత్తు అవసరం లేదని తాము పార్టీని గెలుపు గుర్రం ఎక్కిస్తామని అంటున్నారు. అయితే.. దీనికి భిన్నంగా చంద్రబాబు ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే.. టీడీపీపై నమ్మకం లేక కాదు.. వైసీపీకి ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేసమయంలో క్షేత్రస్థాయిలోనూ.. పార్టీకి బలం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వారంతా కూడా వైసీపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.
దీంతో చిన్నపామునైనా.. పెద్దకర్రతో కొట్టాలనే చందంగా.. మరింత బలంగా ఎన్నికల్లో పావులు కదిపేందుకు జనసేనతో కలిసి ముందుకు వెళ్తే తప్పేంటని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.. కానీ, క్షేత్రస్థాయి నుంచి మాత్రం ఒంటరిగానే వెళ్దామనే ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on March 24, 2022 6:36 pm
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…