జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిన జగన్ వ్యతిరేక ఓటును చీలనివ్వమన్న మాట.. పొత్తులపై కొత్త ఆశలు చిగురించేలా చేసింది. అయితే.. బీజేపీ రోడ్ మ్యాప్ నకు అనుగుణంగా ముందుకు వెళతామని చెప్పిన పవన్ మాట.. తెలుగు తమ్ముళ్లకు స్పీడ్ బ్రేకర్ మాదిరి పని చేస్తోంది. అయితే.. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో తాము అనుకున్నదే జరుగుతుందన్న ధీమా వ్యక్తమవుతోంది. పొత్తులపై పవన్ సుముఖతగానే ఉన్నారని.. వాస్తవం ఆయనకు అర్థమైందన్న మాట తెలుగు తమ్ముళ్ల నోటి నుంచి వినిపిస్తోంది.
నిన్నటి వరకు లేని కొత్త ఉత్సాహం తెలుగు తమ్ముళ్లలో ఉరకలు వేస్తోంది. అందుకు నిదర్శనంగా తాజాగా తెలుగు తమ్ముడు కమ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే 150-160 స్థానాల్లో గెలుపు ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు. ఒకవేళ జనసేనతో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం వంద నుంచి 110 స్థానాల్లో గెలుస్తుందన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది.
నిమ్మల మాటల్ని చూస్తే.. పూర్తిగా జనసేన మీద తాము ఆధారపడి లేమన్న మాటను చెబుతూనే.. అలా అని కొట్టి పారేయకుండా ఉండటం ద్వారా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పాలి. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన నిమ్మల చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే.. వైసీపీ సర్కారు మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఎన్నికల సమయానికి ఇది తుఫాను మాదిరి మారుతుందన్నారు.
జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వలంటీర్లలో 50 నుంచి 70 శాతం మంది ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకున్న సారా మరణాల్ని సిల్లీగా తీసుకున్నారని.. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో భిన్నమైన రాజకీయాలు చూస్తున్నామని.. కక్ష.. వేధింపులు.. కేసులు.. వీటితోనే పాలన ఎక్కువగా సాగుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీగా ఎదుర్కొంటున్నామన్నారు.
జగన్మోహన్ రెడ్డి మాటలు ఒకలా.. చేతలు మరోలా ఉంటాయని.. ఒక్కోసారి అసెంబ్లీలో కూడా ఊహించని రీతిలో ఆయన వ్యవహారశైలి ఉంటుందన్నారు.
ఒకసారి నా మీద కూడా కన్నెర్ర చేశారంటూ ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. ‘‘ఆ రోజు సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. నేను పాల్గొన్నా. దీనికి ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఐదేళ్లు అసెంబ్లీలోకి రానివ్వద్దు. ఐదేళ్లు మైక్ కట్ చేయండి. ప్రివిలేజ్ మోషన్ నేనే మూవ్ చేస్తున్నానంటూ చాలా దూకుడుగా వ్యవహరించారు’’ అని చెప్పారు. సంక్షేమం అన్నంతనే తాను చెబుతున్న నవరత్నాలు.. ఇతర సంక్షేమం అనుకుంటున్నారు. నేను మాట్లాడితే ఆయన చెప్పినవన్న అబద్ధాలు.. అసత్యాలుగా తేలుతాయి. వాటిని తట్టుకోలేక ఆయన అంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతగా నేను ఎక్కడ ఆయన తప్పుల్ని ఎత్తి చూపిస్తానన్న ఆక్రోశంతో ఇదంతా చేశారు. పవిత్రమైన అసెంబ్లీలో వ్యక్తిగత దాడులకు దిగటం కూడా ప్రత్యక్షంగా చూశానని పేర్కొన్నారు.
This post was last modified on March 21, 2022 12:04 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…