వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చం అని చెప్పారాయన అంటే ఇది ఫిక్స్ పొత్తులుంటాయని! అంతేకాదు తానేం చెప్పాలనుకుంటున్నానో వాటిపై కూడా క్లారిటీ ఇచ్చారు.ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని చెప్పడంతో సంబంధిత వర్గాలు పండుగ చేసుకుంటున్నాయి.పవన్ గెలిచినా ఓడినా తామంతా ఆయన వెంటే ఉంటామని ఇవాళ సభా నిర్వహణకు స్థలం ఇచ్చి, వచ్చినవాళ్ళందరి ఆకలి తీర్చి, దాహార్తి తీర్చి మంచి మనసు చాటుకున్న ఇప్పటం గ్రామస్థులు అంటున్నారు.
పవన్ స్పీచ్ లో ఫుల్ క్లారిటీ ఉండడంతో పసుపు పార్టీ పెద్దలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు వీడి రాష్ట్రప్రయోజనాలే ధ్యేయంఅనుకుంటే తప్పక తాము ఏ పార్టీతో అయినా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు పవన్.పవన్ స్పీచ్ తరువాత ఏపీ మంత్రుల్లో అలజడులు ప్రారంభం అయ్యాయి.అప్పుడే పేర్ని నాని స్పందించి కౌంటర్లు దాఖలు చేశారు మీడియా ముఖంగా..!
ఆవిర్భావం అంటే జస్ట్ స్వీట్లు పంచుకుని వెళ్లిపోవడం కాదు అని ప్రూవ్ చేశారు జనసేనాని నిన్నటివేళ. కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఎప్పటిలానే అరుపులు గోలలు ఉన్నా వాటిని చాలా తీవ్రంగా వ్యతిరేకించి నివారించి అభిమానులను నియంత్రించేందుకు ఎంతగానో ప్రయత్నించి సఫలీకృతం అయ్యారు.ఆ దిశగా పవన్ తాను చెప్పాలనుకున్నది చెప్పారు. అరుపులు కేకలు కాదు బాధ్యత కావాలి..మీరు బాధ్యతగా నడుచుకోండి చాలు అన్న అర్థం వచ్చేలా మీ అత్యుత్సాహం నాకు ఆనందం ఇవ్వదు..ఇలాంటివే తగ్గించుకుంటే మేలు.. సీఎం సీఎం అన్న అరుపులు వద్దు అని అంటూనే.. సుతిమెత్తగా చురకలు అంటించారు అభిమానులకు.. ఈ సందర్భంలో సీఎం సీఎం అన్న కేకలకు స్పందిస్తూ అది అయినప్పుడు చూద్దాంలే ముందు మీరు బాధ్యతగా ఉండండి చాలు అని అన్నారాయన.
నిన్నటివేళ పవన్ లో మార్పు కనిపించింది.అదే పనిగా అరిచి ఆవేశంతో ఊగిపోవడం వద్దనుకున్నారాయన.తనదైన శైలిలో మాట్లాడుతూనే భిన్న రీతిలో కొన్ని విషయాలపై హుందాగా స్పందించారు. ముఖ్యంగా రాజధానుల విషయమై క్లారిటీ ఇచ్చారు. రాజు మారినంత మాత్రాన రాజధానులు మారిపోవు..మారకూడదు కూడా ! అన్న స్పష్టత పవన్ లో ఉంది. ఇదే స్పష్టత జగన్ ను ఆకట్టుకుంటుందో లేదా ఆలోచింపజేస్తుందో అన్నది చూడాలి. వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతూనే, రాజధాని సమస్యపై ఆ రోజు తాను ఏ విధంగా స్పందించానన్నది ఆధారాలతో సహా వివరించారు. ఈ కార్యక్రమంలో హైలెట్ ఏంటంటే సభా నిర్వహణకు సహకరించిన ఇప్పటం గ్రామానికి పవన్ తన వంతుగా ఇక్కడిఅభివృద్ధి పనులకు యాభై లక్షల రూపాయల విరాళం ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు.ఇప్పుడిదే స్పీచ్ కన్నా వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This post was last modified on March 15, 2022 10:51 am
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. అప్పటిదాకా వచ్చిన…
నారా చంద్రబాబునాయుడు.. దేశంలోనే సీనియర్ మోస్ట్ నేతగానే కాదు.. ఏ విషయంలో ఎంతదాకా స్పందించాలో తెలిసిన నేత. ఏ విషయంలో…
కాంగ్రెస్ పాలనలో కేవలం ఏడాది కాలంలో తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గణతంత్ర…
భాగ్యనగరి హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. భారత గణతంత్ర దినోత్సవాన తన పార్టీ శ్రేణులకు కొత్త మార్గదర్శకాలు…
నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పాలి. బాలయ్య నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి హిట్ల మీద…