Political News

ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాల లెక్కలివే.. ఏ దేశం దగ్గర ఎన్ని?

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపధ్యంలో మరోసారి న్యూక్లియర్ బాంబులపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9 దేశాల దగ్గర అణు ఆయుధాలు ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ తొమ్మిది దేశాల దగ్గర కలిపి సుమారు 12,300 కంటే ఎక్కువ అణు బాంబులు ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో ఎక్కువ భాగం హిరోషిమాపై వేసిన బాంబు కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనవట. ఈ ఆయుధాల్లో ఒక్కటి పేలినా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు పర్యావరణం పూర్తిగా నాశనమవుతుంది.

అణు బాంబుల సంఖ్యలో రష్యా మొదటి స్థానంలో ఉంది. రష్యా దగ్గర సుమారు 5,459 అణు ఆయుధాలు ఉండగా, అమెరికా 5,044 నుంచి 5,177 బాంబులతో రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలో ఉన్న మొత్తం అణు ఆయుధాల్లో దాదాపు 90 శాతం ఈ రెండు దేశాల దగ్గరే ఉండటం గమనార్హం. అమెరికా తన ఆయుధాలను తన దేశంలోనే కాకుండా జర్మనీ, ఇటలీ, బెల్జియం వంటి మరో ఐదు దేశాలలో కూడా ఉంచింది. ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య ఉన్న పోటీ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

చైనా తన అణు సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది. ప్రస్తుతం చైనా దగ్గర 600 అణు బాంబులు ఉన్నట్లు అంచనా. ఆ తర్వాత ఫ్రాన్స్ దగ్గర 290, బ్రిటన్ దగ్గర 225 ఆయుధాలు ఉన్నాయి. మన దేశం భారత్ దగ్గర 180 అణు బాంబులు ఉండగా, పొరుగు దేశమైన పాకిస్థాన్ దగ్గర 170 ఆయుధాలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ ఉత్తర కొరియాల దగ్గర ఉన్న ఖచ్చితమైన సంఖ్య తెలియకపోయినా, ఇజ్రాయెల్ వద్ద 90, ఉత్తర కొరియా వద్ద 50 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

కేవలం సంఖ్య మాత్రమే కాకుండా, ఈ ఆయుధాల నాణ్యత, పనితీరు కూడా గతంలో కంటే పెరిగింది. గతంలో కంటే ఇప్పుడు ఈ ఆయుధాలు ఇప్పుడు తగ్గినప్పటికీ, వీటి శక్తి మాత్రం ఎన్నో రెట్లు పెరిగింది. ఉదాహరణకు, న్యూయార్క్ లాంటి పెద్ద నగరంపై ఒక్క అణు బాంబు పడితే సుమారు 5,83,160 మంది చనిపోయే అవకాశం ఉందని అంచనా. అణు బాంబు అంటే కేవలం పేలుడు మాత్రమే కాదు, అది కలిగించే రేడియేషన్ ప్రభావం కొన్ని తరాల వరకు కొనసాగుతుంది.

ట్యాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి యుద్ధ రంగంలో వాడటానికి వీలుగా తయారు చేసిన చిన్న తరహా అణు ఆయుధాలు. రష్యా దగ్గర ఇలాంటివి సుమారు 1,912 ఉండగా, అమెరికా దగ్గర 200 వరకు ఉన్నాయి. ఇవి పరిమాణంలో చిన్నవిగా అనిపించినా, వీటి శక్తి హిరోషిమా బాంబు కంటే 20 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందట. అంటే ఈ చిన్న ఆయుధాలు కూడా భారీ విధ్వంసాన్ని సృష్టించగలవు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ అణు నిల్వలు రాబోయే పదేళ్లలో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

This post was last modified on March 6, 2026 11:44 am

Share

Recent Posts

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

4 minutes ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

39 minutes ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

43 minutes ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

2 hours ago

డిజాస్టర్ హీరోతో డిజాస్టర్ డైరెక్టర్?

‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…

2 hours ago

ఇలాంటి వ్యాఖ్యలు అనవసరం పవన్

2024 ఎన్నికల ముందు నుంచి ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి పార్టీల మధ్య సఖ్యత కుదర్చడంలో ఏపీ సీఎం…

3 hours ago