Political News

అదాని భార్యకు వైసీపీ రాజ్యసభ సభ్యత్వం?

వైసీపీ నుంచి ప్రీతి అదానికి రాజ్యసభ సభ్యురాలిగా  అవకాశం దక్కబోతోందా ? మీడియా వార్తల ప్రకారం అవుననే అనుకోవాలి. జూన్ లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే అనీ వైసీపీకే దక్కుతాయి. ఈ నాలుగింటికి  జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ చాలా జోరుగా జరుగుతోంది. నాలుగింటిలో ఒక సీటును విజయసాయిరెడ్డి కి రెన్యువల్ చేస్తారని అందరు అనుకుంటున్నారు.

ఎందుకంటే జూన్లో ఖాళీ అవబోయే నాలుగు సీట్లలో విజయసాయిరెడ్డి ది కూడా ఒకటి. కాబట్టి విజయసాయికి రెన్యువల్ ఖాయం. అంటే ఇక మిగిలిన మూడు స్థానాల్లో ఎవరిని ఎంపిక చేస్తారనేది సస్పెన్సుగా మారింది. ఈ మూడింటిలో అదానీ కుటుంబానికి ఒకటి ఇస్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. దాని ఆధారంగానే తాజాగా గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానికి ఒక స్థానాన్ని జగన్ హామీ ఇచ్చారట. అదానీతో మోడీకున్న సాన్నిహిత్యం వల్ల మోడీ దృష్టిలో పడటానికి  జగన్  అవసరాన్ని పరిగణలోకి తీసుకుంటే అందుకు అవకాశం ఉందనే అనిపిస్తోంది.

 ఇక మిగిలిన రెండు స్ధానాల్లో ఎవరిని ఎంపిక చేస్తారు ? ఇపుడిదే విషయమై చర్చలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే రెండు స్ధానాలు ఇప్పటికే రిజర్వు అయిపోతే మిగిలిన రెండు స్ధానాలకు పోటీ బాగా పెరిగిపోతుంది. ఎప్పటినుండో రాజ్యసభ ఎంపీ పదవిపై  ఆశలు పెట్టుకున్న వైవీ సుబ్బారెడ్డికి ఇపుడు కూడా నిరస తప్పదనే సమాచారం. పార్టీ వర్గాల సమాచారం ప్రకారమైతే రెండు స్థానాల్లో కాపులు, ముస్లిం, మహిళ లేదా ఇతర సామాజిక వర్గాలకు కేటాయించే అవకాశం ఉందంటున్నారు.

ఇప్పటికే పార్టీ తరఫున ఉన్న ఆరుగురు ఎంపీల్లో రెడ్లు, బీసీలకు మంచి ప్రాధాన్యతే దక్కింది. ఒకదానిలో పారిశ్రామికవేత్త, ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన పరిమళ్ నత్వాని ఉన్నారు. బీసీ కోటాలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. అలాగే రెడ్డి కోటాలో అయోధ్య రామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, విజయసాయిరెడ్డి ఉన్నారు. కాబట్టి ఈసారి రెడ్లు, బీసీలకు అవకాశం దాదాపు ఉండదనే అనుకుంటున్నారు.

This post was last modified on March 3, 2022 12:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

5 minutes ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

24 minutes ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

40 minutes ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

57 minutes ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

2 hours ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

2 hours ago