ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక కీలక అధికారి సుదీర్ఘ సెలవుపై వెళ్లిపోయారా? ఆయనను ఇప్పట్లో కనిపించొద్దంటూ.. ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారా? అంటే.. ఔననే గుసగుసే వినిపిస్తోంది. వైసీపీలో అత్యంత గోప్యంగా జరుగుతున్న గుసగుస ను ఒక కీలక అధికారిని సెలవుపై వెళ్లాలని.. మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయట. దీంతో ఆయన సెలవుపై తన సొంత రాష్ట్రం వెళ్లిపోయారని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల.. కేంద్ర మంత్రి ననితిన్ గడ్కరీ.. పాల్గొన్నకార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించారు.
ఈ ప్రసంగానికి సంబంధించి ఒక కీలక అధికారి స్క్రిప్టు రెడీ చేశారు. దీనిని సీఎం జగన్ మైకు ముందు పెట్టుకుని మరీ చదివారు. అయితే.. దీని ఇంగ్లీష్ వెర్షన్లోను.. తెలుగు వెర్షన్లోనూ..చాలా తప్పులు దొర్లాయి. ముఖ్యంగా పర్యాటక రంగంలో వస్తున్న సంస్కరణలు.. రాష్ట్రానికి `వన్నె` తెస్తున్నాయని రాయాల్సిన చోట `వెన్న ` తెస్తున్నాయని రాశారు. సీఎం జగన్ నేరుగా ఇదే చదివారు.
తర్వాత.. దీనిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వన్నె అని అనడం కూడా ముఖ్యమంత్రికి రావడం లేదని.. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మరోసారి విరుచుకుపడ్డారు. ఇవి సీఎంవో వరకు చేరాయి. దీంతో ఇప్పటికే జరిగిన అనేక పొరపాట్ల కారణంగా.. సీఎంజగన్పై ట్రోల్స్ పెరిగిపోయాయని.. ఆగ్రహంతో ఉన్న ఆయన.. తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంగ్లీషులో గట్టి పట్టున్న అధికారితోనే స్క్రిప్టు రెడీ చేయించుకుంటున్నారు.
కానీ.. ఇప్పుడు కూడా అలానే తప్పులు దొర్లా యి. దీంతో సదరు అధికారిని సెలవుపై వెళ్లిపోవాలని మౌఖిక ఆదేశాలు జారీ చేయించారని అంటున్నారు. ఏపీలోని రహదారి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి ఉన్న అవగాహన అధికారులకు కూడా లేక పోవడంపైనా.. సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం వైసీపీలో ఇదే చర్చ సాగుతుండడం గమనార్హం. మరి దీనిలో నిజం ఎంతో తెలియాలంటే.. కొంత వెయిట్ చేయాల్సిందే!