బాల‌య్య జోరు.. చంద్ర‌న్న పోరు క‌లిసేనా!

గ‌త కొద్ది కాలంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్పీడు త‌గ్గిపోయింది.ఇదే స‌మ‌యంలో బాల‌య్య యాక్టివ్ అవుతున్నారు. అంతులేని ఉత్సాహాన్ని అవ‌ధిగా అందుకుని దూసుకుపోతున్నారు.ఆ  వేగంలోఆయ‌న నిర్ణ‌యాలు కూడా బాగానే ఉంటున్నాయి.త‌డ‌బాటు లేదు.తొట్రుపాటు అంత క‌న్నాలేదు. పొలిటిక‌ల్ డైలాగులు కూడా బాగానే పేలుతున్నాయి. న‌చ్చిందే చేద్దాం ఎవ‌డు ఆపుతాడో చూద్దాం అని బాల‌య్య హిందూపురం పొద్దుల్లో చెప్పిన మాట‌లు పొలిటిక‌ల్ హీట్ కు కార‌ణం అయ్యాయి.అదేవిధ‌గా చంద్ర‌బాబు గ‌తం క‌న్నా ఇప్పుడు చాలా విష‌యాల్లో ఆచితూచి స్పందిస్తున్నారు.ఉద్యోగుల ఉద్య‌మాల‌పై కూడా చాలా ఆచితూచి మాట్లాడారు. 

ఎందుకంటే ఈ పీఆర్సీ గొడ‌వ‌లు అన్న‌వి ఎప్పుడూ ఉండేవే క‌నుక తాను కేవలం చ‌లో విజ‌య‌వాడ అనే కార్య‌క్ర‌మం వ‌ర‌కూ మాత్ర‌మే ప‌రిమితం అయి, పోలీసుల చ‌ర్య‌ల‌ను మాత్ర‌మే ఖండించి తెలివిగా త‌ప్పుకున్నారు అన్న‌ది వైసీపీ వాద‌న. కానీ నిజంగా ఆయ‌న మాట్లాడ‌గ‌లిగితే ఉద్యోగుల నుంచి మంచి మ‌ద్ద‌తు ద‌క్కేది అని కానీ ఆయ‌న మాట్లాడ‌లేదు అని ఎందుకంటే రేప‌టి వేళ ఇదే స‌మ‌స్య త‌న‌కు వ‌స్తే దిక్కెవ‌ర‌ని భావించి ఉంటార‌ని ఓ ఉపాధ్యాయ సంఘ నాయ‌కుడు వ్యాఖ్యానించారు.

ఇక కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా బాబు చాలా హుందాగానే ఉన్నారు. వివాదాల‌కు పోవ‌డం లేదు. అప్ప‌టి మాదిరి పెద్దిరెడ్డి అనే పెద్దాయ‌న‌ను ఢీ కొన‌డం లేదు. చిత్తూరు రాజకీయాల‌ను మ‌ళ్లీ ఎందుక‌నో వ‌దిలేశారు.పెద్ద‌గా పట్టించుకోవ‌డం లేదు అన్న టాక్ కూడా  న‌డుస్తోంది. చిత్తూరులో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో  ఎదిగేందుకు గాలి వారసులు చేస్తున్న కృషి కి  పెద్దిరెడ్డి అండ ఉంద‌న్న టాక్ బాగానే ఉంది. కనుక బాబు ఆ నియోజ‌క‌వ‌ర్గం వార్ ను ప‌ట్టించుకోవ‌డం లేదు.

కుప్పం రాజకీయ ప‌రిణామాల‌ను కూడా విజ‌య‌వాడ నుంచే ప‌రిశీలిస్తున్నారు.ఇదే స‌మ‌యాన బోండా ఉమా లాంటి నాయ‌కులు మాట్లాడుతున్న తిరుగుబాటు చేస్తున్నంత  రీతిలో కూడా చంద్ర‌బాబు కానీ, లోకేశ్ కానీ మాట్లాడ‌డం లేదు. ముఖ్యంగా నాని వ్యాఖ్య‌ల‌పై నేరుగా ఇంత‌వ‌ర‌కూ చంద్ర‌బాబు కానీ లోకేశ్ కానీ స్పందించ‌క‌పోవ‌డం వెనుక సిస‌లు కార‌ణం ఏమై ఉంటుందో అన్న వాద‌న లేదా అనుమానం ఒక‌టి ఎప్ప‌టి నుంచో పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో ఉంది.