Political News

రోజా క్లారిటీ ఇచ్చినట్లేనా?

తన రాజీనామాపై నగరి వైసీపీ ఎంఎల్ఏ రోజా క్లారిటీ ఇచ్చేసింది. తాను రాజీనామా చేస్తానని చెప్పినట్లు, రాజీనామా చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తన ప్రత్యర్ధులపై సెటైర్లు వేశారు. తానంటే భయపడుతున్న వారే తనపై ఇలాంటి పనికిమాలిన ప్రచారాలు చేయిస్తున్నట్లు మండిపడ్డారు.

జగన్మోహన్ రెడ్డి అభిమానిగా, మద్దతుదారుగా తాను పార్టీలో ఉంటానని, బతికున్నంత వరకు మరో పార్టీలో చేరాల్సిన అవసరం లేదని స్పష్టంగా ప్రకటించారు. తనకు ఎంఎల్ఏగా రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలంటు జనాలనే ప్రశ్నించారు. తన ప్రత్యర్థులు కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నట్లు మండిపోయారు. తాను ఇసుకను దొంగతనంగా అమ్ముకుంటున్నట్లు తనపై దుష్ప్రచారం చేస్తున్న విషయం తనకు బాగా తెలుసన్నారు.

ఇసుకనో మరొకటో అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. రెండుసార్లు ఎంఎల్ఏగా  గెలిపించిన వైసీపీని వదిలి పెట్టాల్సిన అవసరం తనకు లేదన్నారు. జగన్ కష్టాల్లో ఉన్నపుడు  తాను అండగా నిలిచిన విషయం అందరికీ తెలుసన్నారు. అందరూ పల్లె ప్రాంతాల నుంచి నగరాలకు, పట్టణాలకు వెళిపోతుంటే తాను చెన్నై, హైదరాబాద్ మహానగరాల నుండి నగిరికి వచ్చిన విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. నగిరిలో తాను ఇల్లు కట్టుకున్నాను కాబట్టి తాను ఎప్పటికీ నగిరిలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు.

పార్టీ మార్పు, ఎంఎల్ఏగా రాజీనామా విషయాలపై రోజా క్లారిటీ ఇవ్వటం వరకు బాగానే ఉంది కానీ తన నోటిదురుసు మాటేమిటి అనే చర్చ ప్రత్యర్ధులు నిలదీస్తున్నారు. రోజాకు దూకుడు ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దూకుడు కారణంగానే ప్రత్యర్ధి పార్టీలతో పాటు పార్టీలో కూడా శతృవులు పెరిగిపోతున్నారు. నియోజకవర్గంలో ఎటుచూసినా ప్రత్యర్ధుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. అందుకనే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటినుండే జనాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని రెగ్యులర్ గా జనాల్లోనే ఉంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on February 7, 2022 1:04 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

5 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

5 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago