Political News

సీఎం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

మారుతున్న కాలానికి తగ్గట్లు మార్పు చేసుకోవటానికి మించింది ఉండదు. కానీ.. ఆ విషయాన్ని చేతులు పూర్తిగా కాలిపోయిన తర్వాత మాత్రమే గుర్తించినట్లుంది కాంగ్రెస్ పార్టీ. దేశానికి ఆ పార్టీ మంచి ఎంతో చేసిందో.. మరికొంత చెడు చేసింది. బ్యాడ్ లక్ ఏమంటే.. దేశానికి ఆ పార్టీ చేసిన మేలు కంటే.. చేసిన తప్పులే ఇప్పుడు చాలామందికి భూతద్దంలో కనిపిస్తున్నాయి. సీల్డ్ కవర్ కల్చర్ ను దేశానికి పరిచయం చేసి.. అక్కడెక్కడో ఢిల్లీలో ఉన్న పార్టీ అధినాయకత్వం.. మరెక్కడో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిని డిసైడ్ చేయటమే తప్పించి.. ప్రజల్లో ఎవరికి ఎంత పట్టు ఉందన్న విషయాన్ని పట్టించుకునేది కాదు.

మారుతున్న కాలానికి అనుగుణంగా.. తన సీల్డ్ కవర్ సంస్కృతి మార్చుకున్నా బాగుండేది. కానీ.. అలాంటిదేమీ చేయలేదు కాంగ్రెస్. అధికారానికి దూరమై.. మోడీ మేజిక్ తో అంతకంతకూ తేలిపోతున్న ఆ పార్టీ.. ఇప్పుడు ఉనికి కోసం పోరాడే పరిస్థితుల్లోకి వెళ్లిపోతోంది. ఇలాంటివేళలో.. తన తీరును మార్చుకుంటున్న సంకేతాల్ని ఇస్తూ.. షాకింగ్ నిర్ణయాల్ని ప్రకటిస్తోంది. ఎన్నికల వేళలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయానికి ఒకప్పుడు అస్సలు ఇష్టపడేది కాదు కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో పార్టీ విజయాన్ని సాధించిన తర్వాత కూడా.. కొద్ది రోజులు నానబెట్టి.. స్థానికంగా ఉండే గ్రూపులు కొట్టుకు చచ్చే వేళలో సీన్లోకి ఎంటరై.. పంచాయితీ చేసి.. సీల్డ్ కవర్ తో ఇష్యూను క్లోజ్ చేసే సిత్రమైన అలవాటును ప్రదర్శించటం తెలిసిందే.

ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా.. తన తీరును మాత్రం మార్చుకోలేదు కాంగ్రెస్ పార్టీ. తాజాగా మాత్రం  అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పంజాబ్ రాష్ట్రంలో తమ పార్టీ విజయం సాధిస్తే.. ముఖ్యమంత్రిగా నియమించేది ఎవరన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ అంశంపై సస్పెన్స్ నెలకొంది. తాజాగా దానికి చెక్ పెట్టేస్తూ.. సీఎం అభ్యర్థిని ప్రకటించేశారు.

ప్రస్తుతం పంజాబ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చరణ్ జీత్ సింగ్ చన్నీ వైపునే పార్టీ మొగ్గు చూపింది. ‘సీఎం అభ్యర్థిని నియమించటం ఇబ్బందికర పరిస్థితే. పేదల కష్టాన్ని ఒక పేద బిడ్డ మాత్రమే అర్థం చేసుకుంటారని పంజాబ్ ప్రజలు భావిస్తున్నారు. అందుకే చన్నీనే పంజాబ్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఎన్నికల వేళలోనే సీఎం అభ్యర్థిని ప్రకటించే ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

This post was last modified on February 7, 2022 1:44 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…

6 hours ago

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

9 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

9 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

10 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

11 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

12 hours ago