అప్పులు క‌ట్టలేకే.. ఏపీలో క‌రెంటు కోత‌లు!

ఏపీలో ఇప్పుడు క‌రెంటు కోతలు పెరిగిపోయాయి. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ఒక విధ‌మైన ప‌రిస్థితి ఉంటే.. గ్రామాల్లో మాత్రం రోజుల త‌ర‌బ‌డి క‌రెంటు లేకుండా పోయింది. నిజానికి గ‌డిచిన రెండేళ్లలో ఇదే ఇలా జ‌ర‌గ‌డం. మ‌రి దీనికి కార‌ణం ఏంటి?  ఎందుకు? అంటే.. విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ‌ల‌కు.. పంపిణీ సంస్థ‌లు అప్పులు చెల్లించ‌క‌పోవడ‌మే! క‌నీసం 30 కోట్ల‌యినా.. ఇస్తే.. విద్యుత్‌ను పంపిణీ చేస్తామ‌ని.. చెప్పినా.. ప్ర‌భుత్వం ఆమేర‌కు కూడా నిధులు ఇవ్వ‌లేక‌పోయింది. ప‌లితంగా రాష్ట్రంలో ఇప్ప‌డు విద్యుత్ కోత‌లు ష‌రా మామూలే అన్న విధంగా త‌యార‌య్యాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్‌(ఎన్‌టీపీసీ) నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి అవుతుంది. ఇక్క‌డ న‌నుంచి డిస్కంలు తీసుకుంటాయి. ఈ క్ర‌మంలో బకాయిపడ్డ మొత్తం విషయంలో స్పందించకపోవడం వల్లే  సరఫరా నిలిచిపోయింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీకి డిస్కంలు రూ.350 కోట్ల బకాయి పడ్డాయి. వీటికోసం ఎన్టీపీసీ వర్గాలు రెండు నెలలుగా డిస్కంల కు లేఖలు రాస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ స్పందన లేకపోవడంతో ఎన్టీపీసీ నుంచి రావాల్సిన 800 మెగావాట్ల విద్యుత్‌ను నిలిపేశారు.

ఎన్టీపీసీ బకాయిల వ్యవహారం పరిష్కారమయ్యే వరకూ బహిరంగ మార్కెట్‌లో కొనేందుకూ రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు అవకాశం లేకుండా బ్లాక్‌ చేశారు. డిస్కంలు రెండు రోజులుగా కోతలు విధించాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీకి చెందిన విశాఖ సింహాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి 800 మెగావాట్ల విద్యుత్‌ను డిస్కంలు తీసుకుంటున్నాయి. ఈ సంస్థకు సుమారు రూ.350 కోట్లను డిస్కంలు బకాయి పడ్డాయి. కనీసం రూ.30 కోట్లు చెల్లించాలని అడిగినా, డిస్కంలు అదీ చెల్లించలేదు.

ఎన్టీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తి  నిలిచిందని స‌మాచారం. కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ నిబంధనల ప్రకా రం బకాయిలు చెల్లించనందున బహిరంగ మార్కెట్‌ కొనుగోలుకు అవకాశం లేదు. దీంతో 3వేల మెగావాట్ల కొరత ఏర్పడింది. దీని సర్దుబాటుకు జెన్‌కో థర్మల్‌ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి పెంచాలని ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హిందుజా పవర్‌ కార్పొరేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు డిస్కంలు విద్యుత్‌ తీసుకోవాల్సి వచ్చింది.  సుమారు 500 మెగావాట్లు అక్కడి నుంచి అందుబాటులోకి వచ్చింది.

రాష్ట్రంలో డిమాండ్‌ 170.542 మిలియన్‌ యూనిట్లకు,  పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకు కోత విధించడంతో 24 ఎంయూలకు డిమాండ్‌ తగ్గినా కోతలు అనివార్యమయ్యాయి. డిస్కంలు మరో 22.38 ఎంయూలను కోతల రూపేణా సర్దుబాటు చేశాయి. పీక్‌ డిమాండ్‌ సమయంలో వంతుల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో 2-3 గంటల పాటు కోతలు విధించాయి. ఏదేమైనా క‌నీసం 30 కోట్ల‌యినా చెల్లించి ఉంటే ప‌రిస్థిత మ‌రో విదంగా ఉండ‌డేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.