Political News

కాంగ్రెస్ లో ‘పద్మ’ చిచ్చు

తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నత పద్మ పురస్కారాలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టినట్లే ఉంది. సీనియర్ కాంగ్రెస్ నేత, జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్ కు కేంద్రం పద్మభూషణ్ ప్రకటించింది. ఈయనతో పాటు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ బట్టాచార్య, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కు కూడా పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ప్రకటించింది.

కల్యాణ్ సింగ్ ఎలాగూ బీజేపీ నేత, పైగా జీవించి లేరు కాబట్టి సమస్యే లేదు. బుద్ధదేవ్ భట్టాచార్య పద్మ పురస్కారాన్ని తిరస్కరించారు. ఇక గులాం మాత్రమే ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ పరిస్ధితుల్లో గులాం వాలకం చూస్తే పురస్కారాన్ని అందుకుంటారా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.

సరిగ్గా ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో స్పందనలు మొదలయ్యాయి. పురస్కారానికి ఎంపికైనందుకు శశిధరూర్ లాంటి కొందరు నేతలు గులాంను అభినందించారు. అలాగే జై రామ్ రమేష్ లాంటి నేతలు ఎగతాళి చేస్తున్నారు. పురస్కారాన్ని తిరస్కరించటం ద్వారా బుద్ధదేవ్ లాంటి వాళ్ళు ఆజాద్ (స్వతంత్రం)గా ఉండాలని కోరుకుంటున్నారు. మరి మీరేమని అనుకుంటున్నారు గులాంజీ (బానిస లేదా అణిగిమణిగి ఉండటం) అంటు గులాంను ఎద్దేవా చేస్తున్నారు.

కేంద్రం ప్రకటించిన పురస్కారాలపై జనాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తున్నది. ఫక్తు రాజకీయనేతలను కూడా పురస్కారాలకు ఎంపిక చేయటం ఏమిటంటు జనాలు మండిపోతున్నారు. సుదీర్ఘ రాజకీయజీవితంలో వాళ్ళు సమాజానికి చేసిన సేవలేమిటో చెప్పాలని నిలదీస్తున్నారు. కేంద్రం పురస్కారాలను ప్రకటించిన రాజనీయ నేతలు తమ పార్టీ విధానాలకే కట్టుబడున్నారు. అంతేకానీ ప్రత్యేకించి సమాజం కోసం చేసిందేమీ లేదంటున్నారు. మరీ పరిస్దితుల్లో గులాం కు పురస్కారంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు పెరిగిపోతున్నాయి.

This post was last modified on January 27, 2022 1:46 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 minutes ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

2 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

3 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

3 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

3 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

4 hours ago