కరోనా మహమ్మారి పుణ్యమా అని జీవితాలు తలకిందులు అయిపోతున్నాయి. మంచి మంచి ఉద్యోగాలు చేసుకునే వాళ్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఓ ఉపాధ్యాయుడు లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఉపాధి లేక చివరికి అరటిపండ్ల బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్న వైనాన్ని చూశాం. ఇలా ఎంతోమంది ఇంతకుముందు చేస్తున్న గౌరవనీయమైన పనులు వదిలిపెట్టి ఉపాధి కోసం వేరే మార్గం చూసుకోవాల్సి వచ్చింది. తాజాగా ఓ ఇంటర్నేషనల్ రేసింగ్ డ్రైవర్ అయిన అమ్మాయి.. ఆర్థిక సమస్యల వల్ల పోర్న్ స్టార్‌గా మారాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ అమ్మాయి పేరు.. రెనీ గ్రేసీ. ఆస్ట్రేలియాకు చెందిన గ్రేసీ.. పాపులర్ సూపర్ కార్ రేస్ డ్రైవర్. ఆరేళ్ల కిందటే ఆమె అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్రం చేసింది.
ఐతే 2017లో గ్రేసీని జట్టు నుంచి తప్పించారు. తర్వాత ఏవో పనులు చేసిందామె. ఐతే తర్వాత ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఉపాధి పోయింది. కరోనా పుణ్యమా అని కష్టాలు మరింత పెరిగాయి. దీంతో ఆమె ఆదాయం కోసం పోర్న్ ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకుంది. ఓ పోర్న్ వెబ్ సైట్లో తన న్యూడ్ ఫొటోలు పెట్టింది. ఇంటి కోసం 30 ఏళ్ల కాలానికి తీసుకున్న లోన్ ఉందని.. అలాగే కుటుంబాన్ని చూసుకోవాల్సి ఉందని.. అందుకే పోర్న్ ఇండస్ట్రీలోకి రావాల్సి వచ్చిందని ఆమె చెబుతోంది. మళ్లీ రేసింగ్ సర్క్యూట్లోకి వెళ్లే ఉద్దేశం లేదన్న గ్రేసీ.. ఏడాది కాలంలో తన ఇంటి లోన్ మొత్తం తీర్చేసి భారం దించుకోవాలనుకుంటున్నట్లు చెప్పడం విశేషం. మరి పోర్న్ ఇండస్ట్రీలో గ్రేసీ ఎలా దూసుకెళ్తుందో చూడాలి.
This post was last modified on June 13, 2020 2:41 am
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…