Political News

గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఆ రెస్టారెంట్ కు వెళ్ళిన రాహుల్ గాంధీ

రాజకీయ బాధ్యతల వల్ల పెళ్లి చేసుకోలేదని పలు సందర్భాల్లో సరదాగా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పుడొక రహస్యాన్ని వెల్లడించారు. భారత రాజకీయాల్లో బ్రహ్మచారి నేతగా తరచుగా ట్రోలింగ్ అవుతున్న రాహుల్ గాంధీ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి కేంబ్రిడ్జ్ లోని ఓ రెస్టారెంటుకు వెళ్లినట్టు చెప్పడం ఆసక్తికరంగా మారింది. సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకావిష్కరణ కార్యక్రమం డిల్లీలో జరిగింది. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ తన జీవితంలో జరిగిన సంఘటనను అభిమానులతో పంచుకున్నారు. 

చాలా సంవత్సరాల క్రితం నేను కేంబ్రిడ్జ్ వెళ్ళాను. గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఒక రెస్టారెంటుకు వెళ్ళాను. అది మా అమ్మా నాన్న మొదటిసారి కలుసుకున్న రెస్టారెంట్. ఈ విషయం ఆమెకు తెలియదు. రెస్టారెంటుకు వెళ్లిన తర్వాత ఈ విషయం ఆమెకు చెప్పాను… అని రాహుల్ గాంధీ వెల్లడించారు.  అయితే తన గర్ల్ ఫ్రెండ్ పేరేమిటో రాహుల్ గాంధీ చెప్పలేదు. దాంతో అక్కడకు వచ్చిన మీడియా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాహుల్ అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

రాహుల్ గాంధీ 1990లలో కేంబ్రిడ్జ్‌లో చదువుకున్నారు. అప్పుడు  ఆయనకు వెరోనిక్ అనే స్పానిష్ యువతితో పరిచయం ఉండేదని మీడియాలో ప్రచారం జరిగింది . 1999లో ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్‌లో ఒకసారి , ఆ తర్వాత కేరళ, అండమాన్ పర్యటనలలో మరోసారి వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. కొలంబియాకు చెందిన ఆమె పేరు ‘జువానిటా’ అని కొలంబియా  వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి 2004లో రాహుల్ గాంధీ స్వయంగా స్పందించారు. ఆమె పేరు జువానిటా కాదు వెరోనిక్ అని, ఆమె స్పెయిన్‌కు చెందిన ఆర్కిటెక్ట్ అని తెలిపారు. ఆమె తనకు అత్యంత సన్నిహిత మిత్రురాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత వీరి స్నేహం కొనసాగినట్లు లేదు. 

అయితే అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీ, దాని మిత్రపక్షాలు రాహుల్ గాంధీ ఒక విదేశీ మహిళను వివాహం చేసుకున్నట్లు ప్రచారం చేస్తూనే వున్నారు. బీజేపీ సోషల్ మీడియా అయితే ఒక అడుగు ముందుకు వేసి అనేకమందితో వివాహం ఫిక్స్ చేసి ప్రచారం చేస్తున్నారు.

రాయ్‌బరేలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్‌తో రాహుల్ గాంధీకి వివాహం జరగబోతోందని ప్రచారం చేశారు. దాన్ని ఖండించిన ఆమె రాహుల్ తనకు అన్నయ్య వంటివారానికి స్పష్టం చేశారు. ఆ తర్వాత మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ప్రణీతి షిండేతో రాహుల్ వివాహం అంటూ మరోసారి ప్రచారం చేశారు. అదికూడా తప్పుడు ప్రచారమని తేలిపోయింది.

ఎవరెన్ని ప్రచారాలు చేసినా రాహుల్ గాంధీ ఎప్పుడూ ఖందించలేదు. అసలు పట్టించుకున్నట్టు కూడా కనిపించలేదు. అయితే తొలిసారిగా ఆయన తన నోటినుంచే గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడారు. ఎలాంటి దాపరికం లేకుండా ఉన్నది వున్నట్లు చెప్పేసారు. తన తల్లీ ఆత్మకథ పుస్తకావిష్కరణ సందర్భాన్ని ఎంచుకోవడం గమనార్హం. తన తల్లీ తండ్రి కలుసుకున్న చోటును చూసేందుకు వెంట గర్ల్ ఫ్రెండ్ ను తీసుకెళ్లడం ఒక జీవితకాలపు అనుభూతి ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

This post was last modified on November 17, 2026 4:43 pm

Share

Recent Posts

జగన్ సైతాన్ సైన్యానికి పచ్చ రోగం తగ్గలేదు: షర్మిల

తమ ప్రత్యర్థి అయితే చాలు...టార్గెట్ చేయడం, వ్యక్తిత్వహననానికి పాల్పడడం వైసీపీ నేతలకు అలవాటే. నిండు శాసన సభలో అప్పటి ప్రతిపక్ష…

14 minutes ago

నాగవంశీ మాటల వెనుక మర్మమేమిటో

జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమాల లైనప్ గురించి అభిమానులు, సోషల్ మీడియాలో గత మూడు నాలుగు రోజులుగా చర్చ జరుగుతూనే…

1 hour ago

కర్నూలులో ప్రధాని మోదీ తల్లికి ఆలయం

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. దశాబ్దకాలంగా మోదీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. భారతదేశానికి…

4 hours ago

కోనసీమలో మళ్లీ గ్యాస్ లీక్… చెక్ ఎప్పుడు?

అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ లీకైన ఘటన కలకలం రేపింది. తాడివారి మెరక వద్ద ఓఎన్‌జీసీ…

5 hours ago

టాటా గ్రూప్‌లో మళ్ళీ టేకోవర్ టెన్షన్

భారత పారిశ్రామిక రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాటా గ్రూప్‌లో ఇప్పుడు పాలనా వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి. సంస్థను ఎవరు…

6 hours ago

విశ్వ రహస్యంగా మారుతున్న రిలీజ్ వ్యవహారం

విశ్వంభర థియేటర్ హక్కులు మైత్రి సంస్థ కొన్నదని నిన్నంతా ప్రచారం జరిగింది. రెండు రోజుల క్రితం ఆర్టిస్టు ప్రవీణ్ తాను…

6 hours ago