Political News

కోనసీమలో మళ్లీ గ్యాస్ లీక్… చెక్ ఎప్పుడు?

అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ లీకైన ఘటన కలకలం రేపింది. తాడివారి మెరక వద్ద ఓఎన్‌జీసీ రీ-డ్రిల్లింగ్ బావి నుంచి భారీ శబ్దాలతో సహజ వాయువు లీకవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు వెల్-కంట్రోల్ చర్యలు ప్రారంభించాయి. బావి చుట్టూ 500 మీటర్ల పరిధిని దిగ్బంధించి రెడ్ జోన్ గా ప్రకటించారు.

అంతేకాదు, విద్యుత్ సరఫరా నిలిపివేసి, వాటర్ బ్లాంకెట్ ఏర్పాటు చేశాయి. ఘటన జరిగిన ప్రాంతానికి ఒక కిలోమీటరు పరిధిలోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు, నగరంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. దాదాపు 200 కుటుంబాలను ఖాళీ చేయించారు. సమీపంలోని జాతీయ రహదారి (NH-216)పై వాహనాల రాకపోకలను నిలిపివేసి వేర్వేరు దార్లకు మళ్లించారు.

గ్యాస్ లీక్‌ను అరికట్టడానికి ఓఎన్‌జీసీ నిపుణుల బృందాలు, ఎమర్జెన్సీ సిమెంటింగ్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే, గ్యాస్ సాంద్రత సున్నా అని ఓఎన్జీసీ ప్రకటించింది. జాతీయ రహదారి 216 సమీపంలోని గ్యాస్ బావిలో వర్కోవర్ పనులు జరుగుతుండగా ఉదయం 5 గంటల సమయంలో లీకేజీ జరిగిందని వెల్లడించింది. పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని ఓఎన్జీసీ తెలిపింది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులతో మాట్లాడి భద్రతా ఆడిట్‌కు ఆదేశించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం లేదని ఓఎన్జీసీ వెల్లడించింది.

ఇలా గ్యాస్ లీక్ కావడం ఇది తొలిసారి కాదు. 2026 జనవరి 5వ తేదీన మలికిపురం మండలం ఇరుసుమండలోనూ ఇదే తరహాలో భారీ బ్లో అవుట్ జరిగింది. ఈ తరహా ప్రమాదాలు రిపీట్ కావడంతో కోనసీమ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల పైప్‌లైన్ల నుంచి తరచూ గ్యాస్ లీక్, బ్లో అవుట్ జరుగుతోందని, తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని స్థానికులు వాపోతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on November 17, 2026 1:39 pm

Share

Recent Posts

కీల‌క నిర్ణ‌యం.. కార్య‌క‌ర్త‌లు ఖుషీ ..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా చెబుతున్న `కార్య‌క‌ర్తే నాయ‌కుడు` అనే మాట‌ను తాజాగా రుజువు చేశారు. ఎన్నో…

13 minutes ago

జగన్ సైతాన్ సైన్యానికి పచ్చ రోగం తగ్గలేదు: షర్మిల

తమ ప్రత్యర్థి అయితే చాలు...టార్గెట్ చేయడం, వ్యక్తిత్వహననానికి పాల్పడడం వైసీపీ నేతలకు అలవాటే. నిండు శాసన సభలో అప్పటి ప్రతిపక్ష…

45 minutes ago

నాగవంశీ మాటల వెనుక మర్మమేమిటో

జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమాల లైనప్ గురించి అభిమానులు, సోషల్ మీడియాలో గత మూడు నాలుగు రోజులుగా చర్చ జరుగుతూనే…

2 hours ago

గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఆ రెస్టారెంట్ కు వెళ్ళిన రాహుల్ గాంధీ

రాజకీయ బాధ్యతల వల్ల పెళ్లి చేసుకోలేదని పలు సందర్భాల్లో సరదాగా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పుడొక రహస్యాన్ని…

2 hours ago

కర్నూలులో ప్రధాని మోదీ తల్లికి ఆలయం

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. దశాబ్దకాలంగా మోదీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. భారతదేశానికి…

4 hours ago

టాటా గ్రూప్‌లో మళ్ళీ టేకోవర్ టెన్షన్

భారత పారిశ్రామిక రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాటా గ్రూప్‌లో ఇప్పుడు పాలనా వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి. సంస్థను ఎవరు…

7 hours ago