మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో తాను క్యాసినో ఆడించినట్లుగా రుజువు చేస్తే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా అని వ్యాఖ్యానించారు. క్యాసినో అంటే ఏంటో టీడీపీ నేత, చంద్రబాబు కుమారుడు లోకేశ్కు తెలుసని అన్నారు. తనకు చెందిన కల్యాణ మండపంలో కేసినో ఆడిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. వర్ల రామయ్య, బొండా ఉమా లాంటి వ్యక్తులను నిజనిర్ధారణకు పంపుతారా అని ప్రశ్నించారు. గుడివాడలో ఏదో జరుగుతోందని చెప్తే తానే నిలుపుదల చేయించానని స్పష్టం చేశారు. గుడివాడలో తనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు.
ఇదిలావుంటే, నిజనిర్ధారణ కోసం టీడీపీ బృందం గుడివాడకు చేరుకున్న సమయంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య పోటాపోటీ ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దీంతో గుడివాడలో ఉద్రిక్తత ఏర్పడింది. సంక్రాంతి సందర్భంగా.. గుడివాడలోని కే-కన్వెన్షన్‌లో మంత్రి కొడాలి క్యాసినోలు నిర్వహించారంటూ.. టీడీపీ బృందం నిజనిర్థరణకు వెళ్లగా.. వారిని వెనక్కి పంపాలంటూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. గుడివాడ పార్టీ కార్యాలయం నుంచి కే-కన్వెన్షన్‌కు బయల్దేరిన నేతలను.. నెహ్రూ చౌక్ వద్ద పోలీసులు అడ్డుకోగా.. ఆ పక్క వీధిలో వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించాయి.
ఇరువర్గాల మోహరింపుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బలవంతంగా టీడీపీ బృందాన్ని వాహనాల్లో ఎక్కించి తరలించారు. ఈ క్రమంలో నిజనిర్ధారణ బృందంలోని నాయకులను అరెస్టు చేశారు. అనంతరం వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బొండా ఉమ కారు అద్దాన్ని పగలగొట్టారు. గుడివాడ పార్టీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రాళ్లు రువ్వారు. వైసీపీ శ్రేణులను పోలీసులు కనీసం నిలువరించలేదని టీడీపీ నేతలు మండిపడ్డారు.
కొడాలి నాని దొంగ: బొండా ఉమా
సొంత కన్వెన్షన్ సెంటర్‌లో కొడాలి నాని క్యాసినో నిర్వహించారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. “ఎన్టీఆర్ టు వైఎస్సార్ పేరిట క్యాసినో నిర్వహించారు. ఎన్టీఆర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలను సహించం. సొంత కన్వెన్షన్ సెంటర్‌లో గోవా సంస్కృతిని ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌లో కరోనా చికిత్స తీసుకున్నా అంటే సరిపోతుందా?ఈ వ్యవహారం నుంచి మంత్రి కొడాలి నానిని తప్పిస్తే న్యాయపోరాటం చేస్తాం. కొడాలి నాని దొరికిపోయిన దొంగ.. వెంటనే ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి” అని బొండా ఉమ డిమాండ్ చేశారు.
This post was last modified on January 21, 2022 6:21 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…