ఆ పంట‌ను కొనేది లేదు: KCR

నిన్న మొన్న‌టి వ‌ర‌కు యాసంగి ధాన్యంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించి కేంద్రం ఎందుకు కొన‌ద‌ని ప్ర‌శ్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తాజాగా ఈ విష‌యంపై చేతులు ఎత్తేశారు. యాసంగిలో పంటల సాగు, ఉద్యోగ విభజన, కల్పన లాంటి అంశాలపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్‌లో  కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ భేటీలో రైతులను లాభసాటి పంటలవైపు మళ్లించే బాధ్యత అధికారులదేనని కేసీఆర్ తెలిపారు. రైతుల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వచ్చే వానాకాలం పంటలపై ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. యాసంగిలో కేంద్రం వడ్లు కొనటం లేదు కాబట్టి.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. యాసంగిలో కేంద్రం వడ్లు కొనటం లేదు. కాబట్టి యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. కేంద్ర వైఖరిని రైతులకు అర్థమయ్యేలా చెప్పాలి. ప్రత్యామ్నాయ, లాభసాటి పంటల దిశగా రైతులను మళ్లించాలి.

రైతుల్లో అవగాహన పెంచే బాధ్యత అధికారులు తీసుకోవాలి. వచ్చే వానాకాలం పంటలపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలి. వానాకాలంలో ప్రధానంగా పత్తి, వరి, కంది సాగుపై దృష్టిపెట్టాలి. ఉద్యోగుల విభజనపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్ పలు ఆదేశాలు ఇచ్చారు. కొత్త జోనల్ విధానం ప్రకారమే ఉద్యోగుల విభజన ఉండాలని సూచించారు. స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన జరగాలన్నారు. 5 రోజుల్లో ఉద్యోగు ల విభజన పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు.

కొత్త జోనల్ విధానం ప్రకారమే ఉద్యోగుల విభజన జరగాలి. స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన జరగాలి. కొత్త జోనల్ వ్యవస్థతో పాలన క్షేత్రస్థాయిలో అమలవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు మారుమూల ప్రాంతాల్లో కి వెళ్లాలి. ఉద్యోగులు మారుమూల గ్రామాల్లోకి వెళ్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. 5 రోజుల్లో ఉద్యోగుల విభజన పూర్తి చేసి నివేదిక ఇవ్వాలి. భార్యాభర్తలు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించాలి. స్థానికులకు నష్టం జరగకుండా ఉద్యోగుల విభజన జరగాలి అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.