అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో ప్రతిపక్షాలన్నీ కూడా పార్లమెంటు సమావేశాల విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు మండిపడుతున్నాయి. వరి రాజకీయంతో దాదాపు వారం రోజుల పాటు పార్లమెంటు సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్లమెంటు వేదికగా ఇటు లోక్ సభ అటు రాజ్యసభలో కూడా ఎంపీలు నానా గోల చేసిన విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళు ఎంత ఆందోళన చేసినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ ఎంపీలు రాంగ్ ట్రాక్ లో వెళ్ళారు. కాబట్టే కేంద్రప్రభుత్వమే కాదు చివరకు ప్రతిపక్షాల్లో కూడా చాలా పార్టీలు వీళ్ళకు మద్దతుగా నిలవలేదు.
ఇక్కడ కేసీయార్ చేసిన మరో తప్పు ఏమిటంటే పార్లమెంటు సమావేశాలను బహిష్కరించటం. కేంద్ర వైఖరికి నిరసనగా పార్లమెంటు శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు రాజ్యసభ ఎంపీ కేశవరావు ప్రకటించడమే విచిత్రంగా ఉంది. టీఆర్ఎస్ ఎంపీల్లో నిజాయితీ ఉంటే పార్లమెంటు సమావేశాలు అయ్యేవరకు హౌస్ లో వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తునే ఉండాలి. అలాంటిది బాయ్ కాట్ చేస్తున్నామని ప్రకటించటంలో అర్థమేంటి ? కేంద్రం తమను పట్టించుకోలేదని వీళ్ళు అనుకుంటే సస్పెండ్ చేయించుకునుండాలి.
పార్లమెంటు సమావేశాలు బహిష్కరించడం కన్నా సస్పెండ్ చేయించుకోవటం గౌరవప్రదంగా ఉంటుంది కదా ? తమ ఆందోళనను అణగతొక్కేందుకే తమను పార్లమెంటు నుండి కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందని చెప్పుకునే అవకాశం ఉండేది. అలాకాకుండా వీళ్ళంతట వీళ్ళే పార్లమెంటును బహష్కరిస్తున్నట్లు ప్రకటించారంటేనే తెరవెనుక ఏదో ఒప్పందం జరిగిందనే అనుమానాలు పెరిగిపోయాయి. దీనికి తగ్గట్లే కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎంపీల పార్లమెంటు బహిష్కరణ వెనుక పెద్ద కథే నడిచిందని ఆరోపించారు.
ఓ భూ కుంభకోణంలో నుండి మంత్రి కేటీయార్ బయటపడేందుకే కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపించారు. ఒక రియల్ ఎస్టేట్ సంస్ధ, ఒక ఇరిగేషన్ కాంట్రాక్టు సంస్ధకు నోటీసులిచ్చిన ఈడీ కేటీయార్ కు కూడా నోటీసులు ఇవ్వాల్సుందని రేవంత్ చెప్పారు. అయితే చివరి నిముషంలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారమే ఎంపీల పార్లమెంటు బహిష్కరణగా రేవంత్ చెప్పారు. అందుకనే రెండు సంస్ధలకు నోటీసులిచ్చిన ఈడీ కేటీయార్ మాత్రం నిలిపేసినట్లు వివరించారు.
రాష్ట్రంలోని బర్నింగ్ ప్రాబ్లం కోసం పార్లమెంటులో చేసిన పోరాటం వల్ల తామంతా సస్పెండ్ అయినట్లు చెప్పుకునే అవకాశాన్ని ఎంపీలు కోల్పోయారు. చూస్తుంటే ఇది కేసీఆర్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అనుమానంగా ఉంది. తమ సమస్యల విషయంలో కేంద్రంతో పార్లమెంటు వేదికగా పోరాటాలు చేయకుండా సమావేశాలను ఎందుకు బహిష్కరించారని రైతాంగం కేసీయార్ లేదా ఎంపీలను నిలదీస్తే ఏమని సమాధానం చెబుతారో చూడాలి.
This post was last modified on December 9, 2021 4:05 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…