వైసీపీ నేతలకు, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు మధ్య చాలాకాలంగా మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, మీడియా సమావేశాల్లో, ప్రెస్ మీట్ లలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడం, దూషణలకు దిగడం చూశాం. కానీ, ఈ రోజలు లోక్ సభలో రఘురామ, ఎంపీ మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం పెను వివాదానికి దారి తీసింది. పార్లమెంటు సాక్షిగా తనను అసభ్య పదజాలంతో వైసీపీ ఎంపీలు దూషించారని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.
న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు పోలీసులు అడ్డుపడుతున్నారని జీరో అవర్ లో రఘురామ ఆరోపించారు. రైతులతో పోలీసులు ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని, అది వారి ప్రాథమిక హక్కును హరించడమేనని సభ దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో రఘురామ ప్రసంగానికి అడ్డు తగిలిన ఎంపీ మిథున్ రెడ్డి….రఘురామపై సీబీఐ కేసులున్నాయని, వాటి నుంచి తప్పించుకునేందుకే బీజేపీలో చేరాలని ఆరాటపడుతున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు.రఘురామపై ఉన్న సీబీఐ కేసులపై విచారణ వేగవంతం చేయాలన్నారు.
తనపై 2 సీబీఐ కేసులున్నాయని, కానీ, జగన్ పై 100 సీబీఐ కేసులున్నాయని రఘురామ సభలో ప్రత్యారోపణ చేశారు. ఆ కేసుల విచారణను తేల్చాలని డిమాండ్ చేశారు. అయితే, తాను మాట్లాడుతున్న సందర్భంగా కొందరు వైసీపీ ఎంపీలు తనను అసభ్య పదజాలంతో దూషించారని, —కొడకా నువ్వు మాట్లాడకురా…అంటూ దేవాలయం వంటి పార్లమెంటులో సంచలన వ్యాఖ్యలు చేశారని రఘురామ ఆరోపించారు.
సభ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రఘురామ …వైసీపీ ఎంపీలపై నిప్పులు చెరిగారు. బోసిడీకే అని అనలేదని, ఏకంగా పార్లమెంటు సాక్షిగా అటువంటి నీచమైన భాష వాడారని ఆరోపించారు. సభ రికార్డుల్లో అంతా రికార్డయిందని, ఇదేనా సంస్కారం…అని నిలదీశారు. వైసీపీ ఎంపీలకు తెలుగు రాదని, ఇంగ్లిష్ రాదని, వారికి వచ్చిందనల్లా బూతులు మాట్లాడే భాషేనని ఆరోపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates