ఏపీలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఓ పాట మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. ‘రావాలి జగన్.. కావాలి జగన్.. మన జగన్..’ అంటూ వైసీపీ నేతలు ఆ పాటతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఫిదా ఫేమ్ శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందించిన ఈ పాట యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన ఏకైక పొలిటికల్ చార్ట్ బస్టర్ గా రికార్డు కూడా క్రియేట్ చేసింది. వాస్తవానికి కూడా, జనానికి జగన్ ను చేరువ చేయడంలో ఈ పాట కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.
కట్ చేస్తే…తాజాగా వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అదే పాటను టీడీపీ నేతలు తెగ వాడేస్తున్నారు. వైసీపీ అంటే మండిపడే టీడీపీ నేతలు ఈ పాట వాడడమేంటి అనుకోకండి. జగన్ వైఫల్యాలపై, వైసీపీ నేతల తీరుపై సెటైరికల్ గా ఈ పాటను తెలుగు తమ్ముళ్లు ఓ రేంజ్ లో వాడేస్తున్నారు. జగన్ ను పొగుడుతూ ఆనాడు వైసీపీ నేతలు వీర లెవల్లో వాడిన ఆ పాటను…ఇపుడు జగన్ ను ట్రోల్ చేసేందుకు టీడీపీ నేతలు వాడుతుండడం విశేషం.
తాజాగా తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తిన శివకుమార్‌పై సెటైర్ వేస్తూ టీడీపీ ట్విటర్ ఖాతాలో ఓ సెటైరికల్ సాంగ్ పోస్ట్ అయింది. పార్కులో ఓ బెంచీకి శివకుమార్ పెయింట్ వేయడంపై టీడీపీ నేతలు సెటైర్ వేశారు. అసెంబ్లీలో ఉత్త వెకిలి నవ్వులే కాదు..పార్కుల్లో బెంచీల్లాంటివి కూడా ఏర్పాటు చేయిస్తున్నారంటూ ట్రోల్ చేశారు. అంతేకాదు, శివకుమార్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ భారీ ప్రాజెక్టు చూశాక… సారు తన రేంజ్ కి ఏమాత్రం తగ్గట్లేదనిపిస్తోంది కదూ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో, ఈ సెటైరికల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
This post was last modified on December 6, 2021 1:10 pm
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…