ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి.. భువనేశ్వరి అనుమతిస్తే.. ఆమె పాదాలను తమ కన్నీటితో కడుగుతామంటూ.. ఆయన వ్యాఖ్యానించారు. భువనేశ్వరిని తమ పార్టీ ఎమ్మెల్యేలు కించపరచలేదన్న ఆయన.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను మాత్రం తప్పుబట్టారు.
శాసనసభలో భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కంచపరిచేలా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. గౌరవసభ పేరుతో చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరిని అవమానిస్తున్నారని విమర్శించారు.”చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు అసభ్యవ్యాఖ్యలు చేశారనటం సరికాదు. చంద్రబాబు గౌరవ సభల పేరిట ఆమెకు తీరని అవమానం చేస్తున్నారు. మనస్ఫూర్తిగా చెబుతున్నాం. ఆమెను ఎవరూ కించపరచలేదు.
ఆమెను ఎవరో టీడీపీ ఎమ్మెల్యే అన్నందుకు చితిస్తున్నాం. వల్లభనేని వంశీ మా పార్టీ ఎమ్మెల్యే కాకపోయినా.. సహచర ఎమ్మెల్యేలుగా ఆయన వ్యాఖ్యలను తప్పపడుతున్నాం. ఆ తల్లి అనుమతిస్తే.. మా పార్టీ ఎమ్మెల్యేలందరం మా కన్నీటితో ఆమె పాదాలు కుడుగుతాం“ అని రాచమల్లు వ్యాఖ్యానించారు.. అంతేకాదు.. సీఎం జగన్ తల్లి, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అంటే తమకు ప్రాణమని.. ఎంతో ఎనలేని గౌరవమని పేర్కొన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. అంతే గౌరవం.. తమకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ఉందని చెప్పారు.
అంతేకాదు.. తమ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని చెప్పారు. మహిళలకుఅన్ని రంగాల్లోనూ విశేష అవకాశాలు కల్పిస్తున్నామని చప్పారు. అలాంటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న తమకు మహిళలను ఎలా గౌరవించాలో తెలుసునని చెప్పారు. తాము కానీ.. తమ పార్టీ ఎమ్మెల్యేలు కానీ.. భువనేశ్వరి అమ్మను ఎలా కించపరుస్తామని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మొత్తానికి రాచమల్లు వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.