ఔను.. వైసీపీ నేతల మధ్య ఎక్కడా జోష్ కనిపించడం లేదు. ఎవరూ కూడా హ్యాపీగా కనిపించడం లేదు. ఎందుకంటు.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి.. రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. గత 2019 ఎన్నికల్లో వచ్చి న.. ఎన్నికల్లో 151 సీట్ల భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. నేటికి(మంగళవారం) రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. అయితే.. ఎప్పుడు ఏం జరిగినా.. కేక్ కటింగులు..చేసుకునే ప్రభుత్వ నేతలు.. అసలు.. ఈ విషయాన్ని పట్టించుకోనట్టే వ్యవహరిస్తుండడం.. కనీసం.. జిల్లా కార్యాలయాల్లోనూ సందడి లేకపోవడం.. చర్చకు దారితీసింది.
వైసీపీ నాయకుల జోరు, హుషారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్‌ను సంతోష పరచడమే లక్ష్యంగా.. ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో రెండున్నరేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో నాయకులు సంబరాలు చేసుకుంటారని అందరూ అనుకున్నారు. అయితే.. ఎక్కడా ఊసు కనిపించలేదు. సందడి లేకుండానే రెండున్నళ్ల పండగ రోజు.. ముగిసిపోతుందా? అనే చర్చ సాగుతోంది. అయితే.. ఇలా స్తబ్దుగా ఉండడానికి కారణాలు ఏంటి? అనే విషయాన్ని పరిశీలిస్తే.. ఒకవైపు రాష్ట్రంలో నాలుగు జిల్లాలు ఇంకా వర్షం ప్రభావంతో నే అల్లాడుతున్నాయి.
దీంతో ఆ జిల్లాలను అలా వదిలేసి సంబరాలు చేసుకుంటే భావ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. అదేస మయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే.. తమ నిధులు వాడేశారంటే.. తమ నిధులు తీసుకున్నారని.. పంచాయతీలు, వర్సీటు.. గగ్గోలు పెడుతు న్నాయి. అదేసమయంలో కాగ్ నివేదికలోనూ.. ప్రబుత్వాన్ని గట్టిగానే హెచ్చరించింది. అసలు చేస్తున్న అప్పులకు.. పొంతన ఉండడం లేదని.. అసెంబ్లీకి కూడా చెప్పకుండానే అప్పులు చేస్తున్నారని.. పేర్కొం ది. దీంతో ప్రభుత్వ వర్గాల్లోనూ దీనిపై చర్చ సాగుతోంది.
ఇలాంటి సమయంలో అట్టహాసంగా.. రెండున్నరేళ్ల పండగ చేసుకుంటే.. ఎలా? అనే చర్చ వైసీపీ నేతల మధ్య సాగుతోంది. వీటికితోడు.. అసెంబ్లీలో చంద్రబాబు ఘటన కూడా కొందరు నేతలను ఇంకా కలవర పెడుతోంది. ఇది ఇప్పుడు పబ్లిక్ టాక్ గా మారిపోయింది. టీడీపీ వ్యూహాత్మకంగా.. ప్రజల్లోకి తీసుకువెళ్తోం ది. ఈ క్రమంలో మహిళలంటే.. ప్రభుత్వానికి విలువలేదనే భావన సర్వత్రా వినిపిస్తుండడంతో.. జగన్ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్ల పాలన సంబరాలకు దూరంగా ఉందనే భావన కలుగుతోంది. దీంతో ఎక్కడా చడి చప్పుడు లేకుండా పోయిందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 30, 2021 11:58 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…