Political News

మంత్రి కొడాలిని లేపేస్తా – మాజీ మంత్రి హాట్ కామెంట్లు..

వైసీపీ మంత్రి, ఫైర్ బ్రాండ్ కొడాలి నానిపై.. టీడీపీకి చెందిన యువ నాయ‌కుడు, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర హాట్ కామెంట్లు చేశారు. ‘కొడాలి నానీ.. బందరు రా.. చిటికెన వేలితో లేపేస్తా.. నీకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును తిట్టేంత వాడివా..’ అంటూ హీటెక్కించారు. టీడీపీ పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత అధ్యక్షతన జ‌రిగిన‌ ఆడపడుచుల ఆత్మగౌరవ సభలో కొల్లు ఈ కామెంట్లు చేశారు. అయితే.. ఈ కామెంట్లు ఆల‌స్యంగా వెలుగు చూశాయి. వైసీపీ ప్రజా ప్రతినిధులు హద్దులు దాటి మాట్లాడుతున్నారని, పవిత్రమైన చట్టసభల్లో మహిళలను కించపరుస్తున్న వారి దురాగతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆడపడుచులకు కొల్లు పిలుపునిచ్చారు.

అన్ని రాసి పెట్టుకుంటున్నామని, తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ మంత్రులకు సొంత శాఖలపై పట్టులేదని, బూతులంటే పోటీపడి మరీ మాట్లాడుతున్నారన్నారు.  గడిచిన 30 నెలల్లో ఒక్క అభివృద్ధి పనైనా చేశారా?, మహిళలపై జరుగుతున్న దాడులను ఆపగలిగారా? అని ప్రశ్నించారు.   సీఎం జగన్‌రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో మహిళను దారుణంగా చంపితే న్యాయం చేయలేని వైసీపీ పాలకులు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏం కాపాడతారని ప్రశ్నించారు.  నీచమైన సంస్కృతిని చాటుతున్న వైసీపీ ప్రజాప్రతినిధులకు మహిళలు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమవుతోందన్నారు.

శాసనాలకు వేదిక అయిన అసెంబ్లీలో తెలుగింటి ఆడపడుచును అవమానించేలా వైసీపీ ప్రజాప్రతిని ధులు ప్రవర్తించారన్నారు. రాబోయే రోజుల్లో ప్రశ్నించిన ప్రతి సామాన్యుడి అమ్మ, అక్క, చెల్లి, భార్య శీలాన్ని నడిబజారులో అవమానించి పైశాచికానందం పొందినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే.. గ‌త రెండున్న‌రేళ్లుగా .. మంత్రి కొడాలి.. టీడీపీపైనా.. అధినేత చంద్ర‌బాబుపైనా విరుచుకుప‌డుతున్నా.. ఏ ఒక్క‌రూ స్పందించ‌లేదు. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబు కు జ‌రిగిన అవ‌మానం నేప‌థ్యంలోఅంద‌రూ ఏక‌మ‌వుతున్న‌ట్టుగా సంకేతాలు పంపిస్తున్నారు. ఇదే క‌ట్టుబాటు.. క‌లివిడి.. కొన‌సాగితే.. మంత్రికి అడ్డుక‌ట్ట ప‌డుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 30, 2021 2:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

5 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

6 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

7 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

8 hours ago