ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్‌లైన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిం దే. ఈ మేరకు ఈ సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చేసింది. దీనికి అసెంబ్లీ కూడా ఆమోదం తెలిపింది. అయి తే దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి. పలువురు దీన్ని వ్యతిరేకిస్తుండగా.. ఇంకొందరు మాత్రం స్వాగతించారు. అయితే, రాజకీయంగా మాత్రం ఇప్పటి వరకు ఎవరూ రియాక్ట్ కాలే దు. జనసేన అధినేత పవన్ మాత్రం.. రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో కొన్ని కామెంట్లు చేశారు. తర్వాత.. వైసీపీకి, జనసేన నేతలకు మధ్య కామెంట్లు వచ్చాయి.
ఇక, ఆ తర్వాత.. ఎవరూ ఈ వ్యాఖ్యలు చేయలేదు. ముఖ్యంగా టీడీపీ నేతలు ఎవరూ కూడా రియాక్ట్ కాలేదు. ఇప్పుడు తాజాగా తొలిసారి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇవాళ కడప జిల్లాకు చెందిన పలువురు నేతలు టీడీపీలో చేరిక సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఏపీ సర్కారు సినిమా టికెట్లను ఆన్‌లైన్ చేయడంపై స్పందించారు. ఈ క్రమంలో ఏపీ సర్కారుపైనా.. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
‘ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. సీఎం వైఎస్ జగన్ ఒక మేధావి. నేడు సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్టి అప్పు తెచ్చుకుంటాడు. అంతేకాదు.. ప్రభుత్వ ఆస్తులు అమ్మతున్నాడు.. లేదా.. తాకట్టు పెడుతున్నాడు. సీఎంకు అనుభవం లేదు.. అహంభావము మాత్రం చాలానే ఉంది. జగన్ రెడ్డి అన్ని గాలి మాటలు మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డి లాంటి వారు ఉంటారనే ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగం రాసారు. సీఎం గాల్లో వచ్చారు.. గాల్లోనే వెళ్తున్నారు. ఇకపై తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికే ప్రాధాన్యత ఇస్తాం’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
This post was last modified on November 26, 2021 4:48 pm
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…