ఏపీ అసెంబ్లీ స్పీకర్.. తమ్మినేని సీతారాం.. మారారా? ఆయన ఒకింత రూల్స్‌ను పాటిస్తున్నారా? నిబంధ నల మేరకు ఆయన పనిచేయాలని అనుకుంటున్నారా? అంటే.. తాజాగా అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలను బట్టి.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గత వారం రోజులుగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షం టీడీపీ సభలో ఉన్న సమయంలో వైసీపీ మంత్రులు, సభ్యులు రెచ్చిపోయి.. ఆయనపై దూషణలకు దిగిన విషయం తెలిసిందే. ఇక, దీంతో చంద్రబాబు సభను బాయ్‌కాట్ చేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ సభ్యులకు తిట్టే అవకాశం లేకుండా పోయింది.
దీంతో ఇకనైనా.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెడతారు.. పైపైన కనిపిస్తున్న అంశాలను కాకుండా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలపై వారు చర్చిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, గడిచిన నాలుగు రోజులుగా.. సభలో నాలుగు ప్రశంసలు.. పది పొగడ్తలు అన్న విధంగా సభ సాగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ను పొగడడమే లక్ష్యంగా వైసీపీ సభ్యులు.. సభను వినియోగించుకుంటున్నారు. ఇంద్రుడు, చంద్రుడు అని కొందరు అంటే.. యువ పురుషుడు, శతాబ్దానికి ఒక్కరు ఇలాంటి వారుపుడతారంటూ.. అదే పనిగా బాకా ఊదుతున్నారు.
నిజానికి ఇలాంటి పొగడ్తల కోసం కాదుకదా.. సభ ఉన్నది.. అనే ప్రశ్న ప్రజల నుంచే వ్యక్తమవుతున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. ఇక, స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా జగన్‌ను పొగిడేందుకే సభను పెట్టి.. తమ ధనాన్ని వృథా చేస్తున్నారనే కామెంట్లు కూడా వస్తున్నాయి. దీంతో బహుశ ఆయనకు ఇవన్నీ.. చేరి ఉంటాయేమో.. ఈ రోజు(శుక్రవారం) ఒక కీలక చర్య తీసుకున్నారు. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్, జబర్దస్త్ రోజాకు చురకలు అంటించారు. ఇదేసమయంలో.. అందరి సభ్యులకు ఆయన తేల్చి చెప్పారు.
అదేంటంటే.. సభలో ఈ రోజు ఉదయం ప్రశ్నోత్తరాల సమయం జరిగింది. ఈ సందర్భంగా రోజా.. తన సహజ ధోరణిలో జగన్‌ను ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన.. సీతారాం.. మీరు విషయంలోకి రండి.. సభ మర్యాదను కాపాడాల్సిన అవసరం అందరిపైనా ఉంది. సీఎం జగన్‌పై పొడగ్తలకంటే.. మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి. పొగడ్తలు వద్దు. అంటూ.. వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఒక్కసారిగా.. సభ్యులు.. మౌనం దాల్చారు. ఇక, రోజా కూడా పొగడ్తలకు ఫుల్ స్టాప్ పెట్టి.. విషయంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు సీతారాం చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలానే ఉండండి సార్! అంటూ.. సూచిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates