విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని హైకోర్టు కేంద్రానికి నోటీసులిచ్చింది. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటనను విచారణ సందర్భంగా న్యాయమూర్తి గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం విభజన చట్టానికి, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఎందుకు కట్టుబడి ఉండలేదో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీని తర్వాత వచ్చిన ప్రభుత్వం అమలు చేయాలి. కానీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హామీని నరేంద్ర మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేసింది. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా మోడీ సర్కార్ నూరుశాతం అమలు చేసిన ఘటన ఒక్కటి కూడా లేదు. ఏపీ మీద పగ పట్టినట్లుగా మోడీ ప్రభుత్వం ఎందుకని ఇలా వ్యవహరిస్తోందో ఎవరికీ అర్థం కావడం లేదు. యూపీఏ హామీని గుర్తుచేసే ఏవేవో కతలు చెప్పి మోడీ ప్రభుత్వం తప్పించుకుంటోంది.
ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కు బదులు రైల్వే డివిజన్ అన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను నిలిపేశారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీని పక్కన పెట్టేశారు. ఇలా ఏ రూపంలో చూసినా హామీలన్నింటినీ గాలికొదిలేశారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని కూడా బీజేపీ ఏపీకి ద్రోహంచేసింది.
తాజా పరిస్థితి ప్రకారం చివరకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రాజకీయం అన్నట్లు మారిపోయింది. సజావుగా అమలు చేయాల్సిన హామీలను కూడా రాజకీయం అజెండాగా మార్చాల్సిన ఘనత మోడికే దక్కుతుంది. మోడీ సర్కార్ నిర్వాకంపై సుప్రింకోర్టులో కేసులు దాఖలైనా ఇపుడా కేసుల విచారణ ఏ దశలో ఉందో తెలీదు. అందుకనే హైకోర్టు ప్రత్యేక హోదా అమలు కోసం దాఖలైన కేసును విచారణకు స్వీకరించింది.
మరి తాజాగా హైకోర్టు ఆదేశాలకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే. ఎందుకంటే ఏపీ ప్రయోజనాలను కాపాడాలన్న ఉద్దేశ్యం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఎప్పుడో స్పష్టమైపోయింది. దీనికి ప్రధాన కారణం ఏపీలో బీజేపీకి అసలు ఠికానా లేకపోవటం, ఏపీకి ఎంతచేసినా పార్టీపరంగా ఉపయోగం ఉండదనే అనుమానం కారణమై ఉండవచ్చు. ఏదేమైనా విభజన చట్టం అమలు కోసం న్యాయస్ధానం మెట్లు ఎక్కటం దురదృష్టకరమనే చెప్పాలి. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇస్తున్నపుడు ఏపీకి మాత్రం ఎందుకివ్వటంలేదన్న హైకోర్టు ప్రశ్నకు కేంద్రం ఏమని సమాధానం ఇస్తుందో చూడాల్సిందే.
This post was last modified on November 20, 2021 11:38 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…