Political News

టీడీపీని నంద‌మూరి కుటుంబానికి ఇచ్చేయాలి: మంత్రి పెద్దిరెడ్డి

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం మునిసిపాలిటీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. దీనిపై.. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు పార్టీ నాయకత్వం నుంచి తప్పుకుని, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు పార్టీని అప్పగిస్తే మంచిదని హితవు పలికారు. 72 సంవత్సరాల వయస్సుతో ఒకవైపు వరుస ఓటములు, మరోవైపు తన ఓటు వున్న నియోజకవర్గం నుంచి కూడా కుమారుడు లోకేష్ గెలవలేదనే బాధతో ఉన్న చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి తన ఆరోగ్యంను కాపాడుకోవడం మంచిదని సూచించారు. సిగ్గూ, ఎగ్గూ లేకుండా ఇంకా రాజకీయాల్లోనే ఉంటానంటే అది ఆయన ఇష్టమని అన్నారు.

కుప్పం ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడారని, లోకేష్ తన స్థాయిని మించి మాట్లాడారని మండిపడ్డారు. లోకేష్ ఇలాగే మాట్లాడితే ఇకపై సహించేది లేదని, తగిన విధంగా స్పందన ఉంటుందని హెచ్చరించారు. లోకేష్ మాట్లాడిన మాటలకు కుప్పం ప్రజలు రెండు చెంపలు వాయించి, ఇకపై మా ఊరికి రావద్దని తీర్పు చెప్పారని అన్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో పోటీ చేస్తాడని అనుకోవడం లేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఒకవేళ పుంగనూరు నుంచి పోటీ చేయడానికి చంద్రాబు ఉత్సాహం చూపితే అందుకు స్వాగతిస్తానని అన్నారు.

ఆనాడు కాంగ్రెస్‌లో ఉండి ఎన్టీఆర్‌పైనే పోటీ చేస్తానంటూ.. చంద్రబాబు ప్రగల్భాలు పలికాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తరువాత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కుని, చివరికి ఆయనను పదవి నుంచి దింపేసి, ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబు కారణమయ్యాడని విమర్శించారు. నేడు తెలుగుదేశం పార్టీని తన అసమర్థతతో నిర్వీర్యం చేస్తున్నాడని అన్నారు. సీఎం జగన్ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి ప్రజలు పట్టం కట్టారని రామచంద్రారెడ్డి అన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాల ఫలితమే ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైసీపీ విజయమని అన్నారు. కుప్పం ప్రజలు ఛీ కొట్టిన తరువాత ఇంకా కుప్పం గురించి చంద్రబాబు మాట్లాడతాడని తాము భావించడం లేదన్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఏదో ఒక విధంగా గెలవడానికి టీడీపీ అనేక దౌర్జన్యాలకు పాల్పడిందని గుర్తు చేశారు. చివరికి చంద్రబాబు హైకోర్ట్‌కు వెళ్ళి ప్రత్యేక పరిశీలకులను కూడా నియమించుకునేలా ఉత్తర్వలు తెచ్చుకున్నరని అన్నారు. ప్రజలు వైసీపీకి అండగా ఉంటే, డబ్బు పంపిణీ చేశామంటూ మాపైన తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

This post was last modified on November 17, 2021 4:12 pm

Share
Show comments

Recent Posts

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

18 mins ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

28 mins ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

1 hour ago

ఇదేం ట్విస్ట్ వీరమల్లూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…

2 hours ago

IPL దెబ్బకు ఇంతకన్నా సాక్ష్యం కావాలా

థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…

3 hours ago

ముద్రగడ వ్యాఖ్యలతో వైసీపీ మునుగుతుందా ?

పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…

4 hours ago