తిరుపతి వేదికగా .. ఈ రోజు జరిగిన.. దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో రాష్ట్రాలు లేవనెత్తిన 50 ప్రధాన అంశాల్లో 41 అంశాలకు పరిష్కారం చూపిస్తామని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల.. సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ విభజన హామీలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా.. మొత్తం సమస్యల్లో.. 41 పరిష్కరించేందుకు తక్షణ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
ముఖ్యంగా.. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు ఎదుర్కొంటున్న మత్తు పదార్థాల సమస్యలను అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని.. వచ్చే 60 రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని షా అన్నారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దిగువ స్థాయికి చేర్చే బాధ్యతను ముఖ్యమంత్రులు సైతం తీసుకోవాలని.. ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయన సూచించారు. అదేసమయంలో ఐపీసీ, సీఆర్ పీసీ చట్టాలను సవరించి.. మరింతగా న్యాయం చేరువయ్యేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రాల సాధక బాధలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
నార్కోటిక్(మత్తు పదార్థాలు) అరికట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి పపనిచేస్తుందని .. అమిత్ షా ఉద్ఘాటించారు. ఈ కేసుల్లో రాష్ట్రాలు నేరుగా విచారించేందుకు.. నిందితులకు త్వరగా శిక్షలు పడేందుకు కేంద్రం సహకరిస్తుందని, దీనికి సంబంధించిన చట్ట సవరణ కూడా చేయనున్నట్టు అమిత్ షా వెల్లడించారు. రాష్ట్రీయ ఫోరెన్సిక్ యూనివర్సిటీలను ప్రతి రాష్ట్రంలోనూ ఏర్పాటు చేయనున్నట్టు షా తెలిపారు. ఈ క్రమంలో కాలేజీలను కూడా ఏర్పాటు చేసి.. మత్తుతో ఎదురయ్యే సమస్యలపై.. పాఠాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను రికట్టేందుకు పోస్కో చట్టాన్ని.. మరింత పటిష్టం చేయడంతోపాటు.. 60 రోజుల్లో నిందితులకు.. శిక్ష పడేలా చేస్తామని వెల్లడించారు. ఈ నెల 15(రేపు సోమవారం) జన జాతీయ గౌరవ్ దివస్‌గా కేంద్రం నిర్వహిస్తున్నట్టు.. అమిత్ షా వెల్లడించారు. ఈ క్రమంలో వారోత్సవాలను ప్రతి రాష్ట్రం నిర్వహించాలని సూచించారు. గిరిజనుల ప్రాతినిధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. మొత్తంగా చూస్తే.. రాష్ట్రాలు లేవనెత్తిన 50 సమస్యల్లో 41 సమస్యలకు పరిషఫ్కారం చూపించినట్టు అమిత్ షా తెలిపారు.
This post was last modified on November 15, 2021 7:29 am
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…