రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలనే లక్ష్యంతో ఇక్కడి రైతులు.. మహిళలు.. రెండు సంవత్స రాలకు పైగానే ఆందోళన చేస్తున్నారు. వివిధ రూపాల్లో ఆందోళన చేసిన.. ఇక్కడి ప్రజలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తమ వాదాన్ని.. నినాదాన్ని వినిపించారు. ఈ క్రమంలోనే తాజాగా న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అనే పేరుతో మహాపాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం 7వ రోజుకు చేరుకున్న ఈ పాదయాత్ర కు అకస్మాత్తుగా.. పోలీసుల నుంచి నోటీసులు అందాయి. హైకోర్టు నిబంధనలను.. సూచనలను ఉల్లంఘిం చారని పేర్కొన్నారు.
అయితే.. వాస్తవానికి పాదయాత్రలో ఏం జరిగింది? అనే విషయాన్ని పరిశీలిస్తే.. ప్రభుత్వానికి కానీ, పోలీసుల కు కానీ.. అమరావతి రైతులు పాదయాత్ర చేయడం సుతరామూ ఇష్టం లేదన్న విషయం ఆది నుంచి అందరికీ గుర్తే. పాదయాత్రకు అనుమతి కోరినప్పుడే.. డీజీపీ సవాంగ్ వెనుకా ముందు కూడా ఆలోచించు కోకుండా.. నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అయితే.. దీనిపై హైకోర్టుకు వెళ్లిన అన్నదాతలు.. అనుమతులు తెచ్చుకున్నారు. అయితే.. ఈ క్రమంలో 200 లోపు పాదయాత్ర చేసుకుంటామన్న అన్నదాతల విజ్ఞప్తిపై హైకోర్టు 157కు పరిమితం చేసింది.
అదేసమయంలో కొన్ని నిబంధనలు విధించింది. వీటిని రైతులు పాటిస్తున్నారు. అమలు చేస్తున్నారు. అయితే.. రాజధానిపై ఉన్న మమకారం కావొచ్చు.. రాజధానితో పెనవేసుకున్న బంధం వల్ల కావొచ్చు.. ఇరుగుపొరుగు జిల్లాల నుంచి పాదయాత్రకు ప్రజలు పోటెత్తుతున్నారు. నికరంగా చూస్తే.. పాదయాత్ర కమిటీ కేవలం 160 పాసులను జారీ చేసింది. కానీ, యాత్రకు మధ్యలో చేరేవారు.. కొద్దిసేపు పాదం కదిపి.. మళ్లీ వెళ్లిపోయేవారు.. సహజం. అది ఎలాంటి యాత్ర అయినా.. అభిమానులు పోటెత్తుతారు. అయితే.. వారిని నికర సంఖ్యగా చూపించే పరిస్థితి ఉండదు.
ఇక, డీజే సిస్టం వద్దని హైకోర్టు చెప్పింది. దీంతో పాదయాత్రలో మేళతాళాలు, సంప్రదాయ డప్పులు వినియోగిస్తున్నారు. దీనిపై ఎలాంటి నిషేధం లేదు. ఇక, రాజకీయ ప్రసంగాలకు దూరమన్నారు. ఇదీ.. జరుగుతోంది. అయినప్పటికీ.. నిబంధనల పేరిట ఎందుకు యాగీ చేస్తున్నారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకొంటే.. ఇలాంటి సందర్భాల్లో.. చూసీ చూడనట్టు వ్యవహరించాల్సిన .. పోలీసులు కానీ.. అధికారులు కానీ.. ప్రతి విషయాన్నీ పట్టించుకోవడం.
ఇక, ఎందుకు ఇలా చేస్తున్నారంటే.. ఇప్పటి వరకు.. వైసీపీ నేతలు.. రాజధాని.. సెంటిమెంట్ .. కేవలం.. నాలుగు మండలాలకు, ఆయా గ్రామాలకు మాత్రమే పరిమితమైందని.. అదేసమయంలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమని.. చెప్పుకొంటూ వచ్చారు. కానీ, ఇప్పుడు పాదయాత్రకు మాత్రం.. పొరుగు జిల్లాల నుంచి కూడా మద్దతు లభిస్తుండడం.. కులాలకు, మతాలకు అతీతంగ ప్రజలు పాల్గొనడం.. వంటివి.. సహజంగానే వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నదనేది.. వాస్తవం అంటున్నారు రైతులు. ఏదేమైనా.. పాదయాత్ర ను మధ్యలోనే ఆపడం సమంజసం కాదనే సూచనలు వస్తున్నాయి.