టీఆర్ఎస్ భయమే నిజమైంది. హుజురాబాద్ ఉప ఎన్నిక తొలిరౌండ్లో టీఆర్ఎస్కు ఇండిపెండెంట్ అభ్యర్థి షాక్ ఇచ్చారు. కారు గుర్తును పోలిన రొట్టెలపీట గుర్తుకు 112 ఓట్లు పోలయ్యాయి.
కారు గుర్తును పోలి ఉండటం కారణంగా తమకు నష్టం జరిగినట్లు టీఆర్ఎస్ నేతలు వాపోతున్నారు. అటు హుజురాబాద్ తొలి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలిరౌండ్లో ఈటెల రాజేందర్ 166 ఓట్లతో ముందజలో కొనసాగుతున్నారు.
ఉప ఎన్నిక ముందు టీఆర్ఎస్ రొట్టెల పీట, రోడ్డు రోలర్‌ను గుర్తులను చూసి భయపడింది. ఆ భయం నిజమైంది. రొట్టెపీట గుర్తుకు 112 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్లో బీజేపీ 166 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రొట్టెల పీట, రోడ్డు రోలర్ గుర్తులు గత ఎంపీ ఎన్నికల్లో, దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యాయి. హుజురాబాద్ మొదటి రౌండ్ లోనే రొట్టెల పీటకు 112 ఓట్లు వస్తే మిగతా రౌండ్స్ లో రొట్టెల పీట ప్రభావం ఎంత ఉంటుందో అని టీఆర్ఎస్ ఆందోళన చెందుతున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ 503 ఓట్లతో ఆధిక్యంలో నిలిచింది. మొదటి రౌండ్లో హుజురాబాద్ మండల ఓట్లను లెక్కించారు. ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు, 14 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పూర్తి ఫలితం వెలువడుతుందని అధికారులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates