Political News

డ్రెస్ కోడ్ పై లేడీ డాక్టర్ల నిరసన

ఏదో ఓ నిర్ణయం తీసుకోవటం తర్వాత ఆ విషయమై తీరిగ్గా చింతిచటమో లేకపోతే వాపసు తీసుకోవటమో ఏపి ప్రభుత్వానికి అలావాటైపోయింది. ఇపుడు తాజా విషయం ఏమిటంటే వైద్యులకు డ్రెస్ కోడ్. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులందరికీ డ్రెస్ కోడ్ ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు డిసైడ్ చేశారు. ఒకసారి డిసైడ్ అవ్వగానే డాక్టర్లు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, నర్సులు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో కూడా ఉన్నతాధికారులు ఓ సర్క్యులర్ జారీ చేశారు.

అయితే సర్క్యులర్ జారీ చేయగానే డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు డాక్టర్లకు డ్రెస్ కోడ్ ఏమిటనేది మహిళా డాక్టర్ల పాయింట్. పైగా డ్రెస్ కోడ్ నుండి మగ డాక్టర్లను మినహాయించారు. దాంతో మగవాళ్ళకు లేని డ్రెస్ కోడ్ కేవలం మహిళా డాక్టర్లకు మాత్రమే ఎందుకంటే మండిపోతున్నారు. తాజా సర్క్యులర్ ప్రకారం డాక్టర్లు పొడవు చేతులున్న ఆప్రాన్ తో పాటు తెల్ల చీర లేదా తెల్ల చూడీదార్ ధరించాల్సిందే. మెడలో కచ్చితంగా ఐడీ కార్డు ఉండాల్సిందే అని ఆదేశాల్లో ఉంది.

స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది పొట్టి చేతులున్న ఆప్రాన్, తెల్లచీర కట్టుకోవాలి. మెడలో ఐడీ కార్డు తప్పనిసరి. ఇక మగ డాక్టర్లు కూడా పొట్టి చేతులున్న ఆప్రాన్ వేసుకోవాల్సిందే. కానీ తెల్ల డ్రస్సే వేసుకోవాలని ఏమీలేదు. వాళ్ళిష్టం వచ్చిన డ్రస్సు వేసుకోవచ్చని ఉత్తర్వులు చెప్పారు. దాంతో డాక్టర్ల మధ్య వివక్ష ఏమిటంటు ఆడ డాక్టర్లు మండిపోతున్నారు. ఆప్రాన్, ఐడీ కార్డు వరకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ తెల్లచీరా లేదా తెల్లటి చూడీదార్ వేసుకోవాలన్న ఉత్తర్వులపైనే తమ అభ్యంతరాలంటున్నారు.

స్టాఫ్ నర్సులు, ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది కూడా తెల్లటి డ్రెస్సే వేసుకుని తామూ తెల్లటి డ్రెస్సే వేసుకంటే ఆసుపత్రులకు వచ్చే జనాలకు తేడా తెలుసుకోవటం కష్టమని డాక్టర్లంటున్నారు. పైగా మగ డాక్టర్లకు లేని యూనిఫారమ్, ఆడవాళ్ళకు మాత్రమే ఎందుకని కూడా లేడీ డాక్టర్లు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఉన్నతాధికారులు జారీచేసిన ఉత్తర్వులకు నిరసనగా ప్రభుత్వాన్ని కలిసేందుకు మహిళా డాక్టర్లు రెడీ అవుతున్నారు.

అయితే ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ గీతా ప్రసాదిని మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన డ్రెస్ కోడ్ తో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. ప్రభుత్వ వైద్యులకు యూనిఫారమ్ ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యంగా చెప్పారు. దీనిపై ఎవరికైనా ఏమన్నా అభ్యంతరాలుంటే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అంతేకానీ మగ డాక్టర్లకు మాత్రం డ్రెస్ కోడ్ నుంచి ఎందుకని మినహాయింపు ఇచ్చారంటే మాత్రం సమాధానం చెప్పలేదు. లేడీ డాక్టర్ల మాటను ప్రభుత్వం వినకపోతే చివరకు వాళ్ళు కోర్టులో కేసు వేసినా ఆశ్చర్యం లేదు.

This post was last modified on November 1, 2021 11:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘దళపతి విజయ్’ : సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా..

కోలీవుడ్‌లో చిన్న వ‌య‌సులోనే మంచి పేరు సంపాదించుకున్న ద‌ళ‌ప‌తి విజ‌య్‌. విజ‌య్ సినిమాలు.. క్రిటిక్స్‌, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచ‌నాలు…

28 seconds ago

అవినాష్‌రెడ్డికి మ‌రో చిక్కు.. ఇక‌, బీటెక్ రెడ్డి వంతు!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్ప‌టికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒక‌వైపు బాబాయి వివేకానంద‌రెడ్డి దారుణ…

3 hours ago

కూట‌మి క‌ల‌కాలం.. తేల్చేసిన చంద్ర‌బాబు!

క్షేత్ర‌స్థాయిలో టీడీపీ నాయ‌కుల‌కు, ఎన్డీయే కూట‌మిలో ఉన్న జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కుల‌కు మ‌ధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…

5 hours ago

రాజాసింగ్…క‌న‌బ‌డుట‌లేదు!

రాజాసింగ్‌... రాజ‌కీయాల ప‌ట్ల క‌నీస ప‌రిచ‌యం ఉన్న‌వారికి ఎవ‌రికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి  కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు.…

5 hours ago

ఎంపీ అవినాష్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు?

వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…

8 hours ago