కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ కు బీజేపీ గాలమేస్తోంది. వచ్చే ఏడాదిలో జరగబోయే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్దిగా ఆజాద్ ను పోటీచేయించే అవకాశాన్ని నరేంద్రమోడి పరిశీలిస్తున్నారట. కాంగ్రెస్ నేతను ఏమిటి ఉపరాష్ట్రపతి అభ్యర్దిగా పోటీచేయించటం ఏమిటి అనే సందేహాలు రావచ్చు. కానీ ఆజాద్ అభ్యర్ధిత్వం పరిశీలన విషయంలో మోడికి హిడెన్ అజెండా ఉందని అర్ధమైపోతోంది.
మొదటిదేమో ఆజాద్ ముస్లిం మైనారిటీలకు చెందిన కీలకనేత. రెండో పాయింట్ ఆజాద్ కు జాతీయస్ధాయిలోని వివిధ పార్టీల అధినేతల్లో చాలామందితో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. మూడోది కీలకమైన జమ్మూ-కాశ్మీర్ కు చెందిన నేత. ఆజాద్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికచేస్తే పార్టీల రహితంగా మద్దతు లభిస్తుందని అంచనా వేశారు. అలాగే జమ్మూ-కాశ్మీర్ ఎన్నికల్లో ఆజాద్ సేవలను బీజేపీకి అనుకూలంగా ఉపయోగించుకోవాలని మోడి ప్లాన్ చేస్తున్నారు.
ఫైనల్ పాయింట్ ఏమిటంటే దేశంలోని వివిధ పార్టీల ఎంపీల మద్దతును ఆజాద్ వ్యక్తిగతంగా సంపాదించుకోగలరని మోడి అంచనా వేస్తున్నారు. ఆజాద్ వ్యక్తిగత పలుకుబడికి ఎన్డీయే ఎంపీల మద్దతు కూడా తోడైతే సులభంగా గెలవచ్చని మోడి అనుకుంటున్నారు. హోలు మొత్తంమీద చూస్తే కాశ్మీర్ ఎన్నిక ముందు బలమైన నేత ఆజాద్ ను కాంగ్రెస్ కు దూరం చేయాలనే ప్లాన్ కూడా ఉన్నట్లు అర్ధమైపోతోంది. వీటన్నింటినీ పక్కనపెట్టేస్తే ప్రతిపక్షాలకు చెందిన మంచి ట్రాక్ రికార్డున్న నేతను ఎన్డీయే ప్రభుత్వం ఉపరాష్ట్రపతిని చేసిందని పైకి చెప్పుకోవచ్చు.
మోడి అంతర్గత వ్యూహాలు అందరికీ తెలిసినా పైకి మాత్రం కాంగ్రెస్ నేతను ఎన్డీయే ఉపరాష్ట్రతిగా ఎంపిక చేసిందని చెప్పుకున్నపుడు ఎవరు కాదనేందుకు లేదు. నిజానికి ఆజాద్ ఇపుడు ఔట్ డేటెడ్ నేతయిపోయారనే చెప్పాలి. ఆయన పేరుకు జమ్మూకాశ్మీర్ నేతే అయినా ఏ రోజూ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఉపయోగపడింది లేదు. పైగా కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఆజాద్ పూర్తికాలం పదవిలో ఉండలేకపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఏదేమైనా కాంగ్రెస్ నేతకు మోడి గాలమేయటం కాస్త ఇంట్రస్టింగు గానే ఉంది.
This post was last modified on October 30, 2021 3:57 pm
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…